»   » బాల మూవీ: మ్యూజిక్ డైరెక్టరే విలన్, జ్యోతిక షాకింగ్ లుక్... (ఫోటోస్)

బాల మూవీ: మ్యూజిక్ డైరెక్టరే విలన్, జ్యోతిక షాకింగ్ లుక్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో త్వరలో 'నచ్చియార్' సినిమా రాబోతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో జ్యోతిక ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసారు.

అసలే బాల సినిమాలు ఊహకందని విధంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా సినిమా తీసే బాల ఇందులో జ్యోతికను డిఫరెంట్ గా చూపించబోతున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించబోతున్నారు.

సినిమా కథ ఎలా ఉంటుంది? సినిమా నేపథ్యం ఏమిటి? అనేది ఇంకా తెలియదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

విలన్ పాత్రలో జివి ప్రకాష్

విలన్ పాత్రలో జివి ప్రకాష్

జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జివి ప్రకాశ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. జ్యోతిక ఈ సినిమా ఒప్పుకుంది అంటే కథ గొప్పగా ఉంటుందని అని అంటున్నారంతా.

కంగ్రాట్స్ చెప్పిన సూర్య

కంగ్రాట్స్ చెప్పిన సూర్య

ఈ సందర్భంగా సూర్య తన భార్య జ్యోతిక నటిస్తున్న సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. పెళ్లయిన తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమై ఇటీవలే 36 వయోదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మగలిర్ మట్టుమ్ అనే సినిమాలోనూ జ్యోతిక నటిస్తున్నారు.

హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

హీరో సూర్య తన సహ నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భార్యకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రైడింగ్ నేర్పించడానికి ఇటీవల ఆయన ఏకంగా రోడ్డెక్కారు. చెన్నైలో తాము నివాసం ఉంటున్న వీధులోనే భార్యకు బైక్ రైడింగ్ నేర్పించారు.అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన సూర్య!

దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చిన సూర్య!

సింగం సిరీస్ చిత్రాలతో సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటున్న తమిళ స్టార్ సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ఎస్ 3' (సింగం 3) రిలీజ్ తర్వాత దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్టుగా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Suriya confirmed his wife Jyothika signing Director Bala's flick, First Look Posters of project titled as 'Naachiyar' were unveiled. Composer-turned-Hero GV Prakash Kumar plays the Male Lead in 'Naachiyar'. Music is by Maestro Ilayaraja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu