»   » జ్యోతిక రీ-ఎంట్రీ మూవీ ‘36 ఏళ్ల వయసులో’ ఫస్ట్ లుక్

జ్యోతిక రీ-ఎంట్రీ మూవీ ‘36 ఏళ్ల వయసులో’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తెలుగులో చంద్రముఖితో పాటు ఠాగూర్, మాస్, షాక్ చిత్రాలు నటిగా తనదైన ముద్రవేసి తర్వాత తమిళ స్టార్ సూర్యను వివాహం చేసుకుని నటనకు దూరమయ్యారు సినీనటి జ్యోతిక. ఆమె ఏడేళ్ల సినీ విరామం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నారు.

మళయాళంలో హిట్టయిన 'హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ' అనే సినిమా తమిళ రీమేక్ లో జ్యోతిక నటిస్తున్నారు. ఉమన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ‘36 వయధినిలె' (36 ఏళ్ల వయస్సులో) పేరుతో ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయబోతున్నారు.

Jyothika's 36 Vayadhinile First Look

‘36 వయధినిలె' (36 ఏళ్ల వయస్సులో) చిత్రాన్ని స్వయంగా జ్యోతిక భర్త సూర్య నిర్మిస్తుండటం గమనార్హం. ‘2డి ఎంటర్టెన్మెంట్స్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కేవలం 46 రోజుల్లోనే పూర్తి చేసారు. ఇందులో జ్యోతికకు జోడీగా రెహమాన్ నటించారు. ఆమె క్లోజ్ ఫ్రెండ్ పాత్రలో అభిరామి నటించారు.

పూర్తి మహిళా ప్రదాన మైన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమాకు రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మళయాళంలో కూడా ఆయనే దర్శకత్వం వహించడం గమనార్హం. కథానాయిక పాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మళయాళంలో మంజు నటించింది.

English summary
Malayalam super hit film How Old Are You, which was a box office hit in Mollywood, is remade into tamil.Hero suriya’s wife and veteran actress Jyothika reprised Manju Warrier's role in the Kollywood version and the film titled as "36 Vayadhinile".The first look and the title was unveiled to celebrate the Women's Day (8 March).
Please Wait while comments are loading...