»   » ఇకపై విలన్ గా నటించను!

ఇకపై విలన్ గా నటించను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రం చూసిన వారికి అందులో పాండా క్యారక్టర్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ పాత్రకు మూలం తమిళంలో కాక్క కాక్క సినిమాలోని విలన్ జీవన్ చేసిన పాత్ర. ఆ పాత్రకు గానూ జీవన్ కు అవార్డు సైతం వచ్చింది. ఆ సినిమాలో కనిపించిన జీవన్ తమిళంలో ఫుల్ బిజీ విలన్ గా మారారు. అయితే జీవన్ కి తొలి నుంచీ హీరో అవ్వాలనే కోరిక. దాంతో ఇక విలన్ గా నటించననే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఆయనే మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'యూనివర్శిటీ', 'కాక్కకాక్క', 'తిరుట్టుపయలే', 'మచ్చక్కారన్‌' వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు జీవన్‌. చాలాకాలం తర్వాత ఆయన నటించిన సినిమా 'అదిబర్‌'. విద్య కథానాయిక. ఈనెలాఖరులో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

 Kaakha Kaakha actor Jeevan not intrested in Negitive roles

జీవన్ మాట్లాడుతూ... '' 'నాన్‌ అవన్‌ ఇల్త్లె 2' విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నా. ఈ మధ్యకాలంలో అవకాశాలు వచ్చినా కొన్ని కారణాల వల్ల నటించలేకపోయా. 'యూనివర్శిటీ'లో హీరోగా చేశా. తర్వాత 'కాక్కకాక్క' (తెలుగులో ఘర్ణణ) లో విలన్‌గా కనిపించా. ప్రేక్షకులు నా నుంచి భిన్నమైన చిత్రాలనే ఆశించారు.

పదేళ్లుగా అదే తరహాలో కనిపించా. ప్రస్తుతం 'అదిబర్‌'తోపాటు 'జెయిక్కర కుదిరై', 'కృష్ణలీలై' తదితర చిత్రాల్లో నటిస్తున్నా. ఇకపై విరామం తీసుకోకూడదని భావిస్తున్నా. అంతేకాదు.. విలన్‌గా నటించబోను.

హీరోగా వచ్చే అవకాశాలనే సద్వినియోగం చేసుకుంటా. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా తాపత్రయం. నేనెప్పుడూ అవకాశాల కోసం ఎదురుచూడలేదు. దేవుడు ఇచ్చిన చిత్రాల్లోనే నటిస్తున్నా. త్వరలో విడుదల కానున్న 'అదిబర్‌' తప్పకుండా నాకు మరింత గుర్తింపునిస్తుంది. ఈ సినిమాతో మరోస్థాయికి వెళ్తాననే నమ్మకముంద''ని చెప్పారు.

English summary
Kaakha Kaakha Villan Jeevan said that he is not intrested in Negitive roles any more. Now he is doing as a hero in Adhibar. Adhibar is an upcoming Tamil action film directed by Surya Prakash, starring Jeevan and Vidhya in the leading roles.
Please Wait while comments are loading...