»   » ‘కాలా’ సెన్సార్, 14 కట్స్.... ప్రచారం ఉత్తిదేనా?

‘కాలా’ సెన్సార్, 14 కట్స్.... ప్రచారం ఉత్తిదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ 'కాలా' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.

'కాలా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, ఇందులో 14 చోట్ల కత్తిరింపులు పెట్టిందని ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజం లేదని, 'కాలా' చిత్రం ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి ఉందని చిత్ర యూనిట్ వెల్లడించినట్లు ప్రముఖ తమిళ సినీ వెబ్‌సైట్ పేర్కొంది.


'కాలా' చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కోలీవుడ్లో స్ట్రైక్ నడుస్తుండటంతో సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. స్ట్రైక్ కారణంగా విడుదల ఆగిపోయిన చిన్న సినిమాలకు స్పేస్ ఇవ్వాలని, కాలా సినిమా వాయిదా వేయాలని ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చిత్ర నిర్మాతలను కోరారు.


Kaala censor Report is false

'కాలా' చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న లైకా ప్రొడక్షన్స్ వారు కూడా సినిమాను వాయిదా వేసేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు.


'కాలా' చిత్రాన్ని దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రజనీకాంత్ సినిమా కావడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. దాదాపు రూ. 125 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. దీంతో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 75 కోట్లు అదనంగా వచ్చాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన రజనీకాంత్ అల్లుడు ధనుష్ రూ. 125 కోట్ల లాభాన్నీ సినిమా రిలీజ్ ముందే ఆర్జించారు.


రజనీకాంత్ ఇమేజ్‌కు తగిన విధంగా గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కాలా కరికాలన్ అనే డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్, హ్యూమా ఖురేషి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
There were reports that Rajinikanth's Kaala had already been certified by the regional branch of the Central Board of Film Certification (CBFC), paving way for its April 27 release. But the latest buzz says that it is not true.However, a source close to the film unit has told Behindwoods that the Rajinikanth-starrer is yet to complete the censor formalities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X