»   » కాలా క్లైమాక్స్ సీన్ లీక్.. ఇంటర్నెట్‌లో రజనీ ఫైట్ హల్‌చల్

కాలా క్లైమాక్స్ సీన్ లీక్.. ఇంటర్నెట్‌లో రజనీ ఫైట్ హల్‌చల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
కాలా క్లైమాక్స్ సీన్ లీక్.. ఇంటర్నెట్‌లో రజనీ ఫైట్ హల్‌చల్!!

టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినీ పరిశ్రమకు లీకుల బెడద తప్పడం లేదు. విడుదలకు ముందే ఆ మధ్య అత్తారింటికి దారేది.. బాహుబలి చిత్రాల వీడియోలు నెట్‌లో హల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాలా సినిమాకు లీకుల షాక్ తగిలింది. కాలా సినిమాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేంటే మీరే చూడండి..

కాలా క్లైమాక్స్ సీన్ ప్రత్యక్షం

కాలా క్లైమాక్స్ సీన్ ప్రత్యక్షం

కాలా చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ నెట్‌లో ప్రత్యక్షమైంది. విలన్‌ను చావబాదే సన్నివేశానికి సంబంధించిన క్లిప్లింగ్ లీకైంది. విలన్‌ను రజనీకాంత్, తన్నడం, చెంపపై కొట్టిన సన్నివేశాలు వీడియోలో కనిపించాయి.

మంటల మధ్య రజనీకాంత్

ఫైట్ సీన్ కోసం సెట్‌లో మంటలు పెట్టారు. మంటల నడుమ రజనీకాంత్ వీరోచితంగా ఫైట్లు చేయడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకొంటున్నది. ఈ వీడియోకు య్యూట్యూబ్‌లో మంచి రెస్సాన్స్ వస్తున్నది. లీకైన వీడియో క్లిప్పింగ్‌పై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.

కబలి తర్వాత పా రంజిత్

కబలి తర్వాత పా రంజిత్

కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న చిత్రం కాలా. ఈ చిత్రంలో బాలీవుడ్ తారలు హ్యుమా ఖురేషి, నానా పాటేకర్, సముద్రఖని, ఈశ్వరీరావు తదితరులు నటించారు. రజనీకాంత్‌కు భార్యగా ఈశ్వరీరావు నటిస్తున్నట్టు సమాచారం.

 ఏప్రిల్ 27న విడుదల

ఏప్రిల్ 27న విడుదల

ఇదిలా ఉండగా, కాలా చిత్రాన్ని రోబో2 కంటే ముందుగానే ఏప్రిల్ 27 రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రోబో2 చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ పనులు పూర్తి కాకపోవడంతో రోబో కంటే కాలాను ముందుగా రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

English summary
A dialogue from Kaala found its way to social media, and now a clip has been leaked online. The clip, which lasts for a few seconds, has Rajinikanth fighting a baddie. Reportedly, the clip is from the climax of the film, where Superstar will be seen kicking the villains.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu