Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
యంగ్ హీరోని కాల్చేయబోయిన ఇండియన్ ఆర్మీ.. గట్టిగా అరిచేసిన డైరెక్టర్!
కబాలి, కాలా చిత్రాలలో సూపర్ స్టార్ రజనీని డైరెక్ట్ చేసి పా రంజిత్ ఫేమస్ అయిపోయాడు. రంజిత్ ప్రస్తుతం నిర్మాతగా కూడా మారాడు.డెబ్యూ దర్శకుడు అథియాన్ అతిరాయ్ తెరకెక్కిస్తున్న 'ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు'. అతిరాయ్ గతంలో రంజిత్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. పా రంజిత్ తెరకెక్కించిన అట్టకత్తి చిత్రంలో హీరోగా దినేష్ పరిచయం అయ్యాడు. ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండలో దినేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

నేషనల్ హైవేలో షూటింగ్
ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు చిత్ర షూటింగ్ ఓ ప్రాంతంలో జాతీయ రహదారిలో జరుగుతోంది. ఈ చిత్రంలో దినేష్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. సన్నివేశం ప్రకారం హైవేలో వాహనం వెళుతుండగా దినేష్ లారీకి వేలాడుతూ నటించాలి. అదే సమయంలో హైవేపై ఇండియన్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనం వెళుతోంది. ఆ వాహనంలో ఆర్మీకి చెందిన కమాండోలు ఉన్నారు.

ప్రమాదకరంగా
దినేష్
హైవేపై
ప్రమాదకరంగా
కనిపించడంతో..
ఆర్మీ
కమాండోలు
చిత్ర
దినేష్
లారీని
ఓవర్
టేక్
చేసి
ఆపేశారు.
వెంటనే
దినేష్
పాయింట్
బ్లాంక్
లో
తుపాకీ
గురిపెట్టారు.
వాహనం
ప్రమాదకరంగా
నడుపుతూ
ప్రయాణికుల,
వాహనదారుల
జీవితాలని
రిస్క్
లో
పెడుతున్నాడని
జవానులు
భావించారు.
ఏం
జరుగుతుందో
అని
భయపడిపోయిన
దర్శకుడు
అతిరాయ్
ఆపండి
అంటూ
ఒక్కసారిగా
గట్టిగా
అరిచేశాడట.

లారీ లోపల
ఈ
సన్నివేశంలో
లారీ
లోపల
కెమెరా
ఉండడంతో
జవానులు
ఇది
షూటింగ్
అని
గుర్తించలేదు.
ఇక్కడ
షూటింగ్
జరుగుతోందని
అతిరాయ్
జవానులకు
వివరించడంతో
వారు
హీరో
తలపై
నుంచి
తుపాకీ
తీశారు.
ఈ
సంఘటన
అక్కడున్న
చిత్ర
యూనిట్
మొత్తాన్ని
షాక్
కి
గురిచేసినట్లు
తెలుస్తోంది.
ఆ
తర్వాత
దినేష్
జవానులతో
సరదాగా
ముచ్చటించాడట.
ఒక
వేల
ఇది
సినిమా
షూటింగ్
కాకుండా
తాను
సరదాగా
లారీకి
వేలాడుతూ
ఉంటే
నా
పరిస్థితి
ఏంటని
దినేష్
జవానులతో
చమత్కరించినట్లు
తెలుస్తోంది.

ఆకట్టుకున్న ఫస్ట్ లుక్
చూస్తుంటే ఇరందం ఉలగపోరిన్ కడైసి గుండు చిత్రం మాస్ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ లో దినేష్ లారీ ఇంజన్ పై కూర్చుని గళ్ళ లుంగీతో దర్శనమిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో రెండు భారీ చిత్రాలు చేసే అవకాశం వచ్చినా రంజిత్ కు విజయాలు దక్కలేదు. నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.