»   »  రజనీ 'కబాలి' : పోస్టర్ కాపీ...ఇదిగో ఒరిజనల్ పోస్టర్

రజనీ 'కబాలి' : పోస్టర్ కాపీ...ఇదిగో ఒరిజనల్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే రిలీజైన కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఈ పోస్టర్ కాపీ అనే విషయం తమిళ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఫిలిఫ్పైన్స్ మూవి టిక్ టిక్ అనే హర్రర్ కామెడీ చిత్రం పోస్టర్ ని కలర్స్ కూడా మార్చకుండా ఈ సినిమాకు వాడారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరే చూడండి. ఈ రెండు పోస్టర్స్ కు ఉన్న పోలిక. ఈ టిక్ టిక్ చిత్రం 2012 లో విడుదలైంది. ఇప్పుడీ కాపీ రూమర్స్ పై దర్సకుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

Kabali movie poster copied from a movie Tiktik

ఇక ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14 2016 న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ, తెలుగు డిస్ట్రిబ్యూషన్ ఓవర్ సీస్ రైట్స్ ని సినీ గెలాక్సీ వారు సొంతం చేసుకున్నారు. వారు ఓవర్ సీస్ లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ లు అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్.

సినీ గెలాక్సీ అధినేతలు మీడియాతో మాట్లాడుతూ..."మేము ఈ ప్రాజెక్టులో భాగస్వాములం అవటం చాలా ఆనందంగా ఉంది, మనం, పవర్, భలే భలే మొగాడివోయ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత మేము చేస్తున్న చిత్రం ఇది ," అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారాన్ని బట్టి...ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 106 రోజులు ప్లాన్ చేసారు. జనవరి నెలాఖరు వరకూ షూటింగ్ జరుగుతుంది. చెన్నైలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, మలేషియాకు తరువాత షూటింగ్ కు వెళ్తారు.

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

Kabali movie poster copied from a movie Tiktik

ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

English summary
Kabali movie is written and directed by Pa. Ranjith and The film stars Rajinikanth, Radhika Apte, Kishore, Kalaiyarasan, Dhansika, and Dinesh Ravi. In this movie poster released in september 26th. this poster copied from a Philippines movie Tiktik The Aswang Chronicles is an action horror comedy adventure film released in 2012.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu