»   »  సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన ప్రకాష్ రాజ్

సూపర్ స్టార్ కు షాక్ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ రీసెంట్ గా కమల్ హాసన్ ..చీకటి రాజ్యం, రజనీకాంత్ కబాలి చిత్రాలు కమిటయ్యారు. కమల్ హాసన్ ..చీకటి రాజ్యం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు రజనీ ప్రాజెక్టు కు వచ్చారు. అయితే రజనీ ప్రాజెక్టు కోసం 60 రోజులు బల్క్ డేట్స్ అడిగారు ప్రకాష్ రాజ్ ని. అయితే అన్ని రోజులు డేట్స్ కేటాయించటం కష్టమని, ఇప్పుడు రెండో ఆలోచనలో ప్రకాష్ రాజ్ పడ్డారని సమాచారం. ఈ మేరకు దర్శకుడుతో నో చెప్తాడని తమిళ సిని వర్గాలు అంటున్నాయి. అయితే రజనీ ప్రాజెక్టు కాబట్టి ఉండే అవకాసం ఉందని అన్నా..ప్రకాష్ రాజ్ మాత్రం ఇదే సమయంలో రెండు మూడు సినిమాలు పూర్తి చేయవచ్చని ఆయన తప్పుకుందామనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'కబాలి' . రజనీ 159 వ చిత్రం ఇది. ఇందులో రజనీ గ్యాంగస్టర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం వినాయిక చవితి సందర్బంగా పూజ చేసి, లాంచ్ చేసారు. ఈ లాంచింగ్ పంక్షన్ కు రజనీ తో పాటు దర్సకుడు, నిర్మాత, నటీనటుుల, సాంకేతిక నిపుణులు విచ్చేసారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

అందుతున్న సమాచారాన్ని బట్టి...ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 106 రోజులు ప్లాన్ చేసారు. జనవరి నెలాఖరు వరకూ షూటింగ్ జరుగుతుంది. చెన్నైలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, మలేషియాకు తరువాత షూటింగ్ కు వెళ్తారు.

 ‘Kabali’ :Prakash Raj shocks Super Star Rajini ?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

మరిన్ని విశేషాలకు వస్తే...

220 పేజీల బౌండెడ్ స్క్రిప్టుని ఒక్క రోజులో చదివి,గుర్తు పెట్టుకోవటం సామాన్యమైన విషయం కాదు. అదీ నడి వయస్సు దాటిన రజనీకాంత్ వంటి సూపర్ స్టార్. అదే చేసారు రజనీ. ఆయన తన తాజా చిత్రం 'కబాలి' స్క్రిప్టుని ఒక్క రోజులో మొత్తం చదివేసారు. అంతేకాదు అందులో సీన్స్ ,డైలాగ్స్ విషయమై దర్సకుడుతో చర్చించారు. ఆయన ధారణ శక్తి కు, జ్ఞాపక శక్తికి దర్శకుడు షాక్ కి గురి అయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తెలియచేసారు.

డైరక్టర్ రంజిత్ మాట్లాడుతూ...నేను ఓ వారం రోజులు పడుతుంది ఈ 220 పేజీల స్క్రిప్టు పూర్తిగా చదివి అర్దం చేసుకోవటానికి అనుకున్నాను. కానీ నా అంచనాలు తారు మారు చేసారు. ఒక్క రోజులో మొత్తం చదివేసి తెల్లారి నాతో డిస్కస్ చేసారు.

సినిమాలో ఇంటర్వెల్ గురించి, అనేక డైలాగ్స్ గురించి నాతో చర్చించారు. ఆయనకు స్క్రిప్టుపై ఏర్పడ్డ కమాండ్ చూసి ఆశ్చర్యం వేసింది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు రంజిత్.

English summary
Prakash Raj recently bagged Rajinikanth's Kabali. Buzz is filmmakers demanded 60 days bulk dates from him,Prakash Raj is now having second thoughts about the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu