»   » 'కబాలి' మీట్: కలెక్షన్స్ డ్రాప్ , రజనీ కి తెలిసే డుమ్మా,నిర్మాత మాత్రం...

'కబాలి' మీట్: కలెక్షన్స్ డ్రాప్ , రజనీ కి తెలిసే డుమ్మా,నిర్మాత మాత్రం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: టాక్ చూస్తే తేడాగా ఉంది, కానీ కలెక్షన్స్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు వేరుగా ఉన్నాయి. ధియోటర్స్ హౌస్ ఫుల్ కావటంలేదని ధియోటర్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ నిర్మాత మాత్రం ఇంత లావు కలెక్షన్స్ తమిళ చిత్ర పరిశ్రమలోనే రాలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

అయితే ఆడియో పంక్షన్ కు సైతం రాని..రజనీ ఈ సక్సెస్ మీట్ కు ఖచ్చితంగా వస్తాడని అంతా ఆశించారు. అదే స్దాయిలో మీడియాలోనూ ప్రచారం జరిగింది. కానీ ఆయన రాకపోవటం నిరాశ, మరియు అనుమానాలు కలిగించాయి. కబాలి అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ రావటం లేదని రజనీకి తెలుసు అని అందకే ఆయన ఈ సక్సెస్ మీట్ కా రాలేదని తమిళ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.


ఈ కలెక్షన్స్ విషయంలో సామాన్య ప్రేక్షకుడు నుంచి, సినిమా సీనియర్స్ వరకూ ఈ చిత్రం విషయంలో కన్ఫూజన్ గా ఉన్నారు. భారీ క్రేజ్ తో వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. లింగా కు అన్నయ్య అంటూ ప్రచారం జరుగుతోంది.


కాని నిర్మాత ధాను మాత్రం అద్బుతం జరిగిందనే తొలి రోజు నుంచే కలెక్షన్స్ విషయం గురించి చెప్తూ వస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కలెక్షన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ రాకపోయినా కేవలం రజనీ ఫాలోయింగ్ తో కబాలి సరికొత్త రికార్డ్ లు సృష్టిస్తోందని తెల్చారు.


రజనీకాంత్, పేదల కోసం పోరాడే మాఫియాడాన్ గా నటించిన ఈ సినిమా.. భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోందని,... తొలి వారం కాస్త తడబడినట్టుగా కనిపించినా ప్రస్తుతం కలెక్షన్లు బాగానే ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్.


గురువారం సాయంత్రం చెన్నైలో జరిగిన సక్సెస్ మీట్ లో కలెక్షన్లపై నిర్మాత థాను క్లారిటీ ఇచ్చారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా ప్రకటించారు. రజనీ మానీయా కారణంగా కేవలం ఆరు రోజుల్లో ఈ కలెక్షన్లు సాధ్యమయ్యాయన్నారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో రజని మాత్రం రాలేదు.


స్లైడ్ షోలో సక్సెస్ మీట్ ఫొటోలు...


నిర్మాత మాట్లాడుతూ..

నిర్మాత మాట్లాడుతూ..

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల తో దూసుకెళ్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చెప్పారు.


రజనీసైతం

రజనీసైతం

కబాలి బాక్సాపీస్ వద్ద ఘనవిజయం సాధించడంపై రజనీకాంత్ చాలా సంతోషంగా ఉన్నారని వివరించారు.


దర్శకుడు గొప్పతనమే

దర్శకుడు గొప్పతనమే

ఈ చిత్రం ఈ స్దాయి విజయం సాధించటానికి కారణం దర్శకుడు ఎంచుకున్న స్క్రిప్టు, రజనీని చూపించిన విధానం అని మెచ్చుకున్నారు.


నిర్మాత చెప్పేదాని ప్రకారం

నిర్మాత ధాను చెప్పేదాని ప్రకారం కబాలి చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో హైయిస్ట్ గ్రాసెడ్ ఫిల్మ్


కేవలం ఆరు రోజుల్లోనే

కేవలం ఆరు రోజుల్లోనే

ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే 320 కోట్లు సాధించటం విశేషం అన్నారు.


మానియానే

మానియానే

ఇదంతా రజనీ మానియేనే అని తేల్చి చెప్పారు కలైపులి ధాను.


హ్యాపీ

హ్యాపీ

కబాలి ఈ స్దాయి సక్సెస్ కావటంతో తమ టీమ్ మొత్తం పూర్తి ఆనందంలో ఉందని తేల్చి చెప్పారు.


 దాంక్స్

దాంక్స్

దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ..దర్శకుడుకి, నిర్మాతకు ధాంక్స్ అని తెలియచేసారు. ఇంత పెద్ద హిట్టిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేసారు.


English summary
In the success meet held last night, producer 'Kalaipuli' S Thanu has confirmed the first week’s box office collection of superstar Rajinikanth’s ‘Kabali’. The event was organized in Chennai and was graced by actors John Vijay, Mime Gopi, Kalaiyarasan Harish, Dinesh Ravi and Riythivika among others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu