రజనీకాంత్ ‘కబాలి’ తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'కబాలి'. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో విడుద చేస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇందులో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. దన్షిక, రిత్వికా, దినేష్, కలైయరశన్, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు, నటీనటుల ఎంపికను దర్శకుడు రంజితకే వదిలేయడంతో.. రజనీతో ఇదివరకు చేయనని నటులు పలువురు ఇందులో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో విలన్ గా చైనీస్ స్టార్ జెట్ లీని ఎంపిక చేసారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ క్లారిటీ ఇచ్చింది. మీడియాతో చిత్రం టీమ్ మాట్లాడుతూ.. " ఇది కేవలం రూమర్ మాత్రమే. అసలు మేము ఓ ఇంటర్నేషనల్ స్టార్ ని మా సినిమాలోకి తీసుకోవాలని అనుకోలేదు. ముఖ్యంగా జెట్ లీని అసలు ఊహించలేదు. ఇదంతా కేవలం కల్పన ," అని తేల్చి చెప్పారు.
రజనీకాంత్ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా కనిపిస్తారు. ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రజనీ తెల్లటి గెడ్డంతో ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తున్నారు. స్లైడ్ షోలో ఫోటోస్...

రజనీకాంత్
రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'కబాలి'.

కబాలి
ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో విడుద చేస్తున్నారు.

నటీనటులు
ఇందులో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. దన్షిక, రిత్వికా, దినేష్, కలైయరశన్, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు నటిస్తున్నారు.

మాఫియా డాన్
రజనీకాంత్ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా కనిపిస్తారు. ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











