»   » కమల్‌హాసన్‌ విరాళం..హీరో కార్తీ చేతికి

కమల్‌హాసన్‌ విరాళం..హీరో కార్తీ చేతికి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ నటుడు, దర్శక,నిర్మాత కమల్‌హాసన్‌ వరద బాధితుల కోసం రూ.15 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు కమల్‌హాసన్‌ మేనేజరు నటీనటుల సంఘానికి గురువారం విరాళం మొత్తానికి చెక్కును అందజేశారు. నటుడు కమల్‌హాసన్‌ వరదలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. కానీ మీడియాలో వచ్చిన రీతిలో తాను వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను వక్రీకరించినందువల్లే సమస్య వచ్చిందని ఆయన వివరించారు. వరద బాధితుల కోసం తమిళ, తెలుగు పరిశ్రమలకు చెందిన నటీనటులు విరాళం ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Kamal Haasan donates 15 lakhs to the Chennai flood relief

ఈ నేపథ్యంలో కమల్‌ కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ.15 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కమల్‌ కార్యాలయ ప్రతినిధి ఈ నగదు చెక్‌ను దక్షిణభారత నటీనటుల సంఘం కోశాధికారి కార్తికి గురువారం అందజేశారు.

English summary
Kamal haasan has contributed 15 lakhs for the Chennai flood relief to Tamil Nadu Chief Minister's Relief Fund through Nadigar Sangam. The cheque was handed over to actor Karthi, the Treasurer of Nadigar Sangam by Kamal's manager.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu