»   »  తగ్గేది లేదు: కూతురు మతం మారడంపై కమల్ హాసన్ ట్వీట్

తగ్గేది లేదు: కూతురు మతం మారడంపై కమల్ హాసన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మతం మారినట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తన సోదరి శృతి హాసన్ మాదిరిగానే తాను ముందు నుండి నాస్తికురాలినే అని, అయితే బుద్దిజం నచ్చడంతో దాన్ని ఆచరిస్తున్నాను అంటూ ఆమె తెలిపారు.

అక్షర హాసన్ మీడియా ముఖంగా మతం మారినట్లు తెలుపడంతో ఆమె తండ్రి కమల్ హాసన్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇపుడు ఈ ట్వీట్ సెలబ్రిటీ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది.

కమల్ హాసన్ ట్వీట్

‘హాయ్... అక్షు. నువ్వు మతం మారావా? నువ్వు మతం మారినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమ అనేది మతం మాదిరిగా షరతులతో కూడి ఉండదు. జీవితాన్ని సంతషంగా గడుపు, ప్రేమతో నీ బాపు' అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

నాన్నకు అక్షర హాసన్ రిప్లై

నాన్నకు అక్షర హాసన్ రిప్లై

'హాయ్ నాన్న. మానవ జీవన మార్గం, గమ్యాన్ని బోధించే బౌద్ధ మతాన్ని నేను అంగీకరిస్తున్నా, మతం మారలేదు అంటూ తండ్రి ట్వీట్ కు అక్షర హాసన్ రిప్లై ఇచ్చారు.

Shruti Haasan Caught With Her Boyfriend

అయినా నేను నాస్తికురాలినే

నేను బౌద్దమతాన్ని ఆంగీకరిస్తున్నప్పటికీ నేను నాస్తికురాలినే అంటూ అక్షర హాసన్ రిప్లై ఇవ్వడం గమనార్హం.

తండ్రి కూతుళ్ల సందేశం ఏమిటి?

తండ్రి కూతుళ్ల సందేశం ఏమిటి?

మతం గురించిన ఇలాంటి ట్వీట్ల ద్వారా.... తండ్రి కూతుళ్లు కమల్ హాసన్, అక్షర హాసన్ అభిమానులకు ఒక సందేశం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. మతం అనేది ఒక జీవన మార్గం మాత్రమే. మనుషులను ప్రేమించడానికి, ద్వేషించడానికి మతం అనేది కారణం కాకూడదు అనే భావం వారి ట్వీట్ల ద్వారా స్పష్టమవుతోంది.

English summary
"Hi. Akshu. Have you changed your religeon? Love you, even if you have. Love unlike religeon is unconditional. Enjoy life . Love- Your Bapu" Kamal Haasan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X