విడుదల ముందే: బాలచందర్ ఆరోగ్యంపై కమల్ హాసన్
చెన్నై: ప్రముఖ సీనియర్ దర్శకుడు బాలచందర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. 84 సంవత్సరాల ఆయన వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ద్వారా సినిమా రంగానికి పరిచయమైన పలువురు స్టార్స్ ఆయన్ను ఆసుపత్రికి వచ్చి పరామర్శించి వెలుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ చెన్నైలోని ఆయన ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు.
ఆయన శిష్యుల్లో ఒకరైన కమల్ హాసన్ ప్రస్తుతం 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ ఆసుపత్రిలో చేరుకున్న విషయం తెలుసుకుని వెంటనే ఆయన మేనేజనర్ కు ఫోన్ చేసి మాట్లాడారట. ఈ మేరకు తన గురువు ఆరోగ్యంపై ఓ వీడియోలో కమల్ మాట్లాడారు. "'ఉత్తమ్ విలన్' చాలా త్వరగా పూర్తి చేయాలని ఇటీవల బాలచందర్ సర్ నన్నడిగారు. విడుదలకముందే ఆ సినిమా చూడాలనుకుంటున్నానని చెప్పినట్లు వెల్లడించారు.

బాల సర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఆయన మేనేజనర్ కు ఫోన్ చేశాను. స్పృహలో లేరని, కొన్ని రోజుల నుంచి ఎవరితో మాట్లాడటంలేదని చెప్పారు. అయినప్పటికీ ఫోన్ లో నేను పలకరించినప్పుడు తన పేల గొంతుతో స్పందించారు. పని పూర్తి చేసుకుని త్వరలో మిమ్మల్ని చూసేందుకు వస్తానని చెప్పాను. ఆయన త్వరగా కోలు కోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ప్రస్తుతం చెన్నై ఆల్వార్ లోని కావేరీ ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











