Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కమల్ విశ్వరూపంలో బాలీవుడ్ సెక్సీ డాల్ కాజోల్...!?
కమల్ హాసన్ 'విశ్వరూపం" సినిమా చేస్తాడో లేదోగానీ, ఆ సినిమా పేరు చెప్పి బోల్డంతమంది హీరోయిన్లు పేర్లు తమిళనాట కమల్ కి జంటగా గాసిప్స్ రూపంలో విన్పిస్తున్నాయి. సోనాక్షి సిన్హా, కత్రినాకైఫ్, కాజల్ అగర్వాల్, త్రిష, అసిన్, శ్రియ..ఇలా 'విశ్వరూపం" సినిమాలో హీరోయిన్ నటిస్తోందంటూ ఆయా హీరోయిన్ల లిస్ట్ చాంతాడంత తయారయ్యింది.
అయితే ఇప్పటిదాకా 'విశ్వరూపం" సినిమలో ఏ హీరోయిన్ నటిస్తోందన్న విషయమై స్పష్టమైన క్లారిటీ రావడం లేదు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ డస్కీ బ్యూటీ కాజోల్ పేరు చేరిపోయింది. చాలామందిని పరిశీలించాక, ప్రస్తుతం కమల్ హాసన్ హీరోయిన్ వేటను కాజోల్ దగ్గర పాస్ చేసినట్టు తెలుస్తోంది. స్వయంగా ముంబై వెళ్లి మరీ కాజోల్ తో 'విశ్వరూపం" గురించి కమల్ చెప్పి, ఆమెను ఒప్పించాడట.
అజయ్ దేవగన్ ని పెళ్లిచేసుకొన్న తర్వాత సినిమాలకు అడపా దడపా గ్యాప్ ఇస్తున్నా, వెండితెతరకు పూర్తిగా దూరమైపోలేదు కాజోల్. కాజోల్ ఆమె పాపులారిటీ అలాంటిది మరి. ఓ సౌత్ సినిమాలో చేయనున్న మాట వాస్తవమే..అయితే ఈ విషయమై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుందని కాజోల్ కూడా ఇన్ డైరెక్ట్ గా 'విశ్వరూపం" ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది.