For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమల్ హాసన్ 'అమర్‌ హై' వివరాలు...

  By Srikanya
  |

  చెన్నై : నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా దక్షిణాదిన తనదైన ముద్రవేసిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు బాలీవుడ్‌ నిర్మాతగా మారబోతున్నారు. వీరేంద్ర అరోరా, అర్జున్‌ కె.కపూర్‌తో కలసి త్వరలో 'అమర్‌ హై' అనే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో కమల్‌ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఆయనతో పాటు మరో ప్రముఖ నటుడు కీలక పాత్రలో కనిపిస్తారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ప్రస్తుత రాజకీయాలు, మనీ లాండరింగ్‌ తదితర అంశాలపై ప్రశ్నలు సంధించేలా చిత్రం ఉండబోతోందట. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. నవంబరులో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట కమల్‌. 2012లోనే కమల్‌ బాలీవుడ్‌లో సినిమా నిర్మించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

  'విశ్వరూపం' సినిమాకు సంబంధించిన వివాదం, ఆ తర్వాత పరిణామాల కారణంగా ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు. 'ఉత్తమవిలన్‌', 'పాపనాశం', 'విశ్వరూపం2'... ఇలా మూడు సినిమాలతో బిజీగా ఉన్న కమల్‌ హాసన్‌ తన తర్వాత సినిమా కోసం షూటింగ్‌ లొకేషన్స్‌ పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి కమల్‌ హాసనే దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కమల్‌ ఇటీవల మారిషస్‌ వెళ్లొచ్చారని సమాచారం. అయితే ఈ పర్యటన ఏ సినిమా కోసమో తెలియాల్సి ఉంది.

  Kamal Hassan's Hindi film AMAR HAIN Re-launched

  'ఉత్తమ విల్లన్‌' విషయానికి వస్తే...

  ఇక 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విల్లన్‌'. ఆయన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి ఒకటో తేదీన జరుగనుంది. రెండేళ్ల పాటు ఎదురుచూస్తున్న కమల్‌ అభిమానులకు ఇదో పెద్ద ఉత్సవంలా మారింది. అభిమానులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని కూడా నగర శివారులోని ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు కమల్‌.

  ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. ఇందులో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. 14వ శతాబ్ధానికి చెందిన కళాకారుడిగా, నేటి ట్రెండ్‌కు తగిన ఓ సుప్రీంస్టార్‌గానూ ఇందులో నటించారు కమల్‌. అయితే మూడో పాత్రనే అత్యంత గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్‌.

  ఇందులో కమల్‌ గురువు 'దర్శకశిఖరం' కె.బాలచందర్‌ ముఖ్య భూమిక పోషించారు. అందువల్లే ఈ సినిమా కోసం కమల్‌ అభిమానులు మాత్రమే కాకుండా.. కె.బాలచందర్‌ కుటుంబీకులు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ తొలివారంలో సినిమాను తెరపైకి తీసుకురానున్నారు

  జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్‌', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

  మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్‌', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

  కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

  దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  English summary
  Kamal Hassan, unarguably country's most versatile actor-directors is once again making his tryst with Bollywood reviving his Hindi film AMAR HAIN that he was scheduled to make in 2012 but the movie was put on backburner due to his hectic schedules down South.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X