»   » మళ్లీ మార్చరు కదా?: విశ్వరూపం-2 న్యూ రిలీజ్ డేట్

మళ్లీ మార్చరు కదా?: విశ్వరూపం-2 న్యూ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hassan's Vishwaroopam 2 to release on April 30
చెన్నై : గత ఏడాది విడుదలయిన 'విశ్వరూపం' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్‌తో పాటు తొలి భాగంలో నటించిన ప్రధాన తారాగణమంతా సందడి చేయనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులోనూ వినియోగించారు. తొలిభాగంలో పోలీసుల నుంచి తప్పించుకున్న తీవ్రవాదులు భారత్‌పై విధ్వంసాలతో ఎలా విరుచుకుపడ్డారనేదే కథ. తొలి భాగం సంచలనం సృష్టించటంతో .. స్కీక్వెల్‌పైనా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం నిర్మాంతర పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రియల్ 30న విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నోమార్లు, రకరకాల కారణాలతో విడుదల తేదీలు మార్చుకుంటూ వస్తోంది. దాంతో ఈ సారైనా ఈ విడుదల తేదీకి ఫిక్స్ అవుతారా లేదా అన్నది ఎవరికీ అంతు చిక్కటం లేదు.

రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

English summary
Kamal Hasan’s forthcoming action sequal movie Vishwaroopam2 starring Kamal Hasan himself in the lead role will release world wide on 30 April. Vishwaroopam-2 is produced by V.Ravi Chandra under the banner Ascar Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu