»   » వక్రీకరించారంటూ కమల్ ఆవేదన...వివరణ

వక్రీకరించారంటూ కమల్ ఆవేదన...వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :ప్రముఖ నటుడు కమల్‌హాసన్ , తమిళనాడు ఆర్ధిక మంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం మాటల యుద్ధం కొత్త టర్న్ తీసుకుంది. తాను కట్టిన పన్ను సొమ్ము ఏమైందని ప్రశ్నించలేదని, వరద దుస్థితిపై అసలు ప్రభుత్వాన్ని విమర్శించనేలేదని కమల్‌హాసన్ సోమవారం వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటనలో ...ఉత్తరాదిలోని ఓ పాత్రికేయ మిత్రుడికి రాసిన ఆంగ్ల లేఖలో తన మాటలను వక్రీకరించారని వాపోయారు. అంతేగాక ఇది పన్నీర్‌ సెల్వం విమర్శలకు బదులు కాదని, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహృదయులు గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ప్రకటన విడుదల చేస్తున్నానని స్పష్టం చేశారు.

Kamalhaasan issues a press note to clear the air.

ఆ ప్రకటనలో ఏముందంటే...

''నేను కట్టిన పన్ను సొమ్ము ఏమైందని ఎక్కడా, ఎవర్నీ ప్రశ్నించలేదు. కొన్ని ప్రసార మాధ్యమాలు తప్పుగా ప్రకటించాయి. ఉత్తరాది పాత్రికేయ మిత్రుడికి రాసిన ఆంగ్ల లేఖలో కొన్ని విషయాలు మాత్రమే తమిళ ప్రతికల్లో వచ్చాయి. ఆ లేఖలో నేను ప్రస్తావించినదంతా తమిళ ప్రజలు వరదల్లో బాధపడుతున్నారని తప్ప మరొకటి కాదు. ఆ లేఖలో నేనెక్కడా తమిళనాడు ప్రభుత్వం గురించి గానీ, పన్ను డబ్బు గురించిగానీ ప్రస్తావించలేదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడమే నా కర్తవ్యం. మా ఇంటికి కొన్ని రోజులుగా పత్రికలు రాలేదు. టెలిఫోన్లు పనిచేయలేదు. ఇంటర్నెట్‌ అప్పుడప్పుడూ పనిచేస్తుండడంతో వార్తలు తెలుసుకోగలుగుతున్నాను. వరద బాధితులు త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నా. మౌనంగా ఉంటే వాస్తవాలు అవే బయటకి వస్తాయని భావించాను. అంతేగానీ ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు.

ఇది ఆర్ధిక మంత్రి పన్నీర్‌ సెల్వంకు బదులుగా రాస్తున్న లేఖ కాదు. నా అభిమాన సంఘాల నిర్వాహకులు అయోమయానికి గురికాకూడదన్న తలంపుతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నా. పార్టీలకతీతంగా వ్యక్తిగత కోపతాపాలకు తావు లేకుండా విపత్తుని ఎదుర్కోవాలని, బాధితులకు సేవ చేయాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారెవ్వరినీ నిరూత్సాహపరిచే విధంగా మాట్లాడలేదు.

ఒకవేళ నా మాటలు బాధపెట్టి ఉంటే క్షమాపణ అడిగేందుకు సిద్ధంగా ఉన్నాను. వాద ప్రతివాదాలకు ఇప్పుడు తావు లేదు. నాకు వత్తాసు పలికేవాళ్లు, విమర్శించేవాళ్లు వారి వారి వివాదాలను పక్కనపెట్టి బాధితులను ఆదుకోవడంపై దృష్టి సారించండి. అధికారంలో ఉండే ఏ పార్టీ ప్రభుత్వమైనా వారికి తోడ్పడే విధంగా నా అభిమాన సంఘం 36 ఏళ్లుగా సేవలందిస్తోంది. నేను ఏ రాజకీయ పార్టీలో చేరకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాను'' అని ఆ ప్రకటనలో కమల్‌హాసన్ వివరించారు.

English summary
Kamal Haasan clarified that his remarks were not intended at government, insisting that he had remained apolitical for long. “My letter carried only my concern over the disaster and the sufferings of the people and there was neither any mention about the Tamil Nadu government nor had I asked how my tax money was being spent,” he said.
Please Wait while comments are loading...