»   » జూ ఎన్టీఆర్ పరువు పూర్తిగా తీసేద్దామనే డీసైడ్ అయ్యారా?

జూ ఎన్టీఆర్ పరువు పూర్తిగా తీసేద్దామనే డీసైడ్ అయ్యారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు తెలుగు హీరోలందరి చూపూ తమిళ మార్కెట్ పై ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తిని అక్కడ ఓంశక్తి అంటూ అదే రోజూ రిలీజ్ చేసారు. అయితే అక్కడ కూడా సినిమా సేమ్ టాక్ తెచ్చుకుంది. దాన్ని నుంచి కోలుకునేలోగా ఎన్టీఆర్ ,మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో వచ్చిన కంత్రి చిత్రాన్ని పోకిరి పయ్యా టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఆ సినిమా కూడా తెలుగులో పెద్దగా ఆడలేదు. దాంతో ఎన్టీఆర్ అభిమానులకు కొత్త బెంగ పట్టుకుంది. ఎన్టీఆర్ ప్లాప్ చిత్రాలను వరసగా రిలీజ్ చేసి అక్కడ మార్కెట్ మొదలకాకుండానే క్లైమాక్స్ కు చేర్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

అంతేగాక అక్కడ ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేస్తున్న నిర్మాతలు హన్సికను హైలెట్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నారు. కారణంగా అక్కడ హన్సికకు మంచి మార్కెట్ ఉందని చెప్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర టెలి ఫిలింస్ పతాకంపై నిర్మాత బి శారదారెడ్డి తమిళ ప్రేక్షకులకు అందిస్తున్నా రు. ఈ చిత్రం గురించి ఆమె తెలుపుతూ చిన్నతనంలోనే తల్లిదండుల్ని కోల్పయిన ఒక పిల్లాడు అనాథగా పెరిగి పెద్దవాడై తన తల్లిదండ్రులను చంపిన వారిపై ఎలా ప్రతికారం తీర్చుకొన్నాడనేదే చిత్ర కథాంశమన్నారు. మాప్పిళ్లైతో హిట్ కొట్టిన హన్సిక గ్లామర్ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ అన్నారు.

English summary
Jr NTR Kantri as Pokiri Paiyya in Tamil! Jr NTR Kantri telugu movie is now being dubbed into Tamil as Pokiri Paiyya. P Saradha Reddy is producing NTR Kantri Tamil dubbed version under Sree Venkateswara Tele Films banner and released by Indian Images.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu