For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదం ముదిరింది : నిర్మాతపై స్టార్ దర్శకుడు ఫిర్యాదు

  By Srikanya
  |

  చెన్నై : సినిమా హక్కుల విషయమై ఎగ్రిమెంట్ లు ఉల్లంగించి డబ్బు చేసుకోవాలనే నిర్మాత పై కంప్లైంట్ పెట్టారు కార్తీక్ సుబ్బరాజు. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా తను డైరక్ట్ చేసిన చిత్రం రైట్స్ ని అమ్మేసారని ఆయన అన్నారు. ఆ రైట్స్ లో తనకు వాటా ఉందని, అది ఎగ్రిమెంట్ రాసుకున్నామని మీడియాకు తెలియచేసారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  పూర్తి వివరాల్లకి వెళితే...

  'పిజ్జా' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌. ఆ తర్వాత 'జిగర్‌దండా'తో మరో అడుగు ముందుకేశారు. ప్రస్తుతం ఈ సినిమా హక్కుల కోసం ముంబయి వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కథ హిందీ హక్కులను అనుమతి లేకుండా నిర్మాత ఎస్‌.కదిరేశన్‌ విక్రయించినట్లు కార్తిక్‌ సుబ్బురాజ్‌ దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు.

  దీనిగురించి ఆయన మాట్లాడుతూ సినిమాను ఆరంభించేటప్పుడు 40 శాతం హక్కులు నాకు కూడా ఉన్నాయని ఒప్పందం చేసుకున్నాం. అయితే కదిరేశన్‌ నాకు తెలియకుండా హిందీ హక్కులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. అందుకే దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశా. ఈ సమస్యను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందామని పలుమార్లు అడిగా. కానీ ఆయన సహకరించలేదన్నారు.

  పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సినిమా.. తమిళనాట విజయం సాధించడంతో పాటు ఇటీవల ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహాకు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది.

  Karthik Subbaraj obtains injunction against Hindi remake of 'Jigarthanda'

  సిద్ధార్థ్ కు తెలుగులోనూ ఉన్న మార్కెట్ దృష్ట్యా.. జిగర్తాండ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసే యోచనలో ఉన్నారు. చిక్కడు దొరకడు పేరుతో ఈ సినిమా తెలుగులో అనువాదమవుతోంది. అయితే.. తెలుగులోకి రాకముందే ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్తోంది.

  దక్షిణాది సినిమాలతో బాలీవుడ్ లో కిక్, హౌస్ ఫుల్ వంటి విజయాలు అందుకున్న సాజిద్ నడియడ్ వాలా.. జిగర్తాండ సినిమా హిందీ రీమేక్ హక్కులు అందుకున్నాడు. దీంతో.. ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.బాలీవుడ్ లో ఏస్థాయి విజయం సాధించనుందో కానీ ఈ లోగా దర్శక,నిర్మాతలు మధ్య గొడవలు మొదలైనట్లు చెన్నై వర్గాల సమాచారం.

  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు ..ఈ చిత్రం రైట్స్ లో నలబై పర్శంట్ షేర్ ఉంది. అయితే గప్ చుప్ గా...నిర్మాత రైట్స్ అమ్మేసాడు. విషయం తెలుసుకున్న సుబ్బరాజు మండిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన డైరక్టర్స్ అశోశియేషన్ కు తీసుకు వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  ఇదిలా ఉంటే... తెలుగు వెర్షన్ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అనూహ్యంగా విడుదల వాయిదా వేశారు. ఇతర నిర్మాతలకు, పంపిణిదారులకు సినిమా విడుదల చేయడం లేదనే వార్తను స్వయంగా తెలిపిన నిర్మాత కదిరేశన్.. తనకు చెప్పకపోవడంపై హీరో సిద్దార్ధ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు కూడా తెలుపలేదట. తెలుగులో ఈ సినిమాను పంపిణి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకే విడుదల వాయిదా వేశారని సమాచారం.

  దర్శకుడు కార్తీక్, నేను. సినిమా టెక్నిషియన్స్ అందరూ ‘జిగర్తాండ' చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. కనీసం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా విడుదల వాయిదా వేశారు. దీనికి కారణం కొందరు వ్యక్తులు, వారి నీచ రాజకీయాలు. వారు సినిమా విడుదలను మాత్రమే అడ్డుకోగలరు, సినిమా విజయాన్ని కాదు. మంచి సినిమా ఎప్పుడు విడుదల అయినా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ కార్తీక్ & ‘జిగర్తాండ' టీం. త్వరలో కొత్త విడుదల తేదిని తెలుస్తుంది. ‘ అంటూ సిద్దార్ధ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

  English summary
  Filmmaker Karthik Subbaraj has obtained an interim injunction on the Hindi remake of his critically acclaimed Tamil film 'Jigarthanda', alleging the producer of cheating him by selling the remake rights without his knowledge. Reportedly, 'Jigarthanda' producer Kathiresan sold the Hindi remake rights of the movie to Sajid Nadiadwala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X