»   » పవర్ ఫుల్ హీరోకు కీర్తి సురేశ్ అదిరిపోయే గిఫ్ట్.. వారేవ్వా సూపర్బ్..

పవర్ ఫుల్ హీరోకు కీర్తి సురేశ్ అదిరిపోయే గిఫ్ట్.. వారేవ్వా సూపర్బ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలయదళపతి, తమిళ సూపర్ స్టార్ విజయ్ జూన్ 22న తన 42వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్నారు. ఆయన బర్త్ డేను పురస్కరించుకొని ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. తన సన్నిహితులు, అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది ఆయనకు ప్రేమతో గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు. అయితే హీరోయిన్ కీర్తి సురేశ్ మాత్రం విజయ్‌కి షాక్ ఇచ్చేంతగా బహుమతి ఇచ్చారు.

Keerti Suresh special gift for Vijay on his birth day

ఇంతకీ కీర్తీ సురేశ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే.. చాలా ప్రత్యేకమైన పెయింటింగ్. దానిని స్వయంగా కీర్తీ సురేశ్ వేసి ఇవ్వడం దాని స్పెషాలిటీ. తన అభిమాన నటుడైన విజయ్ కోసం తాను చేసిన చిన్న ఆర్ట్ వర్క్ అంటూ కీర్తి సురేష్ వీటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పెయింటింగ్‌ను చూసి విజయ్ ఫ్యాన్స్ తమ హీరో పట్ల చూపించిన అభిమానానికి కీర్తి సురేశ్‌పై ప్రశంసల వర్షం కరిపిస్తున్నారు. భైరవ చిత్రంలో కీర్తి సురేష్, విజయ్తో కలిసి నటిస్తున్నది. విజయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 'భైరవ' ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు.

English summary
Tamil Superstar Vijay's celebrated hi 42nd birthday on June 22. In this occassion, heroine Keerti Suresh Gifted a painting to Vijay. Fans are feeling its special for Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu