»   » సునంద హత్య గురించేనా? నటి కుష్భూ తీరుపై దర్శకుడి ఫైర్..!

సునంద హత్య గురించేనా? నటి కుష్భూ తీరుపై దర్శకుడి ఫైర్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి కుష్భూపై తమిళ దర్శకుడు ఎఎం రమేష్ మండి పడ్డారు. కుష్బూ తన సినిమా విషయంలో జోక్యం చేసుకోవడం, తన సినిమాకు సంబంధించిన స్టోరీ చెప్పాలని తమను వేధించడం, తమ యూనిట్ సభ్యులను ఈ విషయాల గురించి అడుగుతున్నారని మండి పడ్డారు.

ప్రస్తుతం ఎఎం రమేష్ ‘ఒరు మెల్లికొడు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ హత్యోదంతం గురించే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓగా ఉన్న కుష్బూ ఈ చిత్రం కథాంశం ఏమిటనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందని, స్టోరీ చెప్పాలని యూనిట్ సభ్యులను వేధిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

Khushbu

కుష్బూ తన చిత్ర యూనిట్ సభ్యులను స్టోరీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు...ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బూ తన యూనిట్ సభ్యులనేు అడిగే బదులు తననే అడగవచ్చారు. నా సినిమా ఓ హత్యోదంతం గురించే, ఇందులో మనీషా కొయిరాలా హత్యకు గురవుతారు. ఆ హత్య గురించి జరిగే ఇన్వెస్టిగేషనే ఈ చిత్రం అన్నారు.

కాగా.... ఎఎం రమేష్ ఆరోపణలను నటి కుష్భూ ఖండించారు. సునంద పుష్కర్ హత్యోదంతం గురించే సినిమా తీస్తున్నారా? అనే విషయాలు తాను ఎవరినీ అడగలేదన్నారు. ఈ విషయంలో తన గురించి అసత్య ప్రచారం జరుగుతోందని కుష్భూ స్పష్టం చేసారు. అర్జున్ భార్య ఈ చిత్రంలో నటించాలని అడిగారని, తాను సినిమాలకు దూరంగా ఉంటున్న విషయాన్నే చెప్పాను, అంతకు మించి మరేమీ లేదు అన్నారు.

English summary
Khushbu denies ‘Oru Melliya Kodu’ Controversy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu