»   » విడుదల సమస్య, రజనీకాంత్‌తో తెగ ఆడుకుంటున్నారు!

విడుదల సమస్య, రజనీకాంత్‌తో తెగ ఆడుకుంటున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కొచ్చాడయాన్' విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు సినిమా విడుదల తేదీలు ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా వేసారు. తాజాగా ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారైనా విడుదల అవుతుందో? లేదో? చివరి నిమిషం వరకు చెప్పడం కష్టమే.

ఆ సంగతి పక్కన పెడితే రజనీకాంత్‌తో అభిమానులు తెగ ఆడుకుంటున్నారు. కొంపతీసి ఈ విషయాన్ని మరోలా అర్థం చేసుకోవద్దు. సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన 'కొచ్చాడయాన్' మొబైల్ గేమ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య 1 మిలియన్ దాటింది. దీన్ని బట్టి రజనీకాంత్ సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Kochadaiiyaan mobile games cross 1 million download

ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ బాషలతో పాటు ఇతర బాషల్లోనూ రిజలీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమసింహ' పేరుతో విడుదల కానుంది. 'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. రజనీకాంత్ సినిమా కావడం, భారత దేశంలో తెరకెక్కిన తొలి మోషన్ కాప్చర్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ తరహా 3డి చిత్రం రావడంతో భారతీ సినీ రంగంలో ఇదే తొలిసారి.

English summary
Two official mobile games inspired by the forthcoming Rajinikanth-starrer "Kochadaiiyaan" have crossed one million downloads on mobile applications.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu