Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే
సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తరువాత విడుదల కాబోతున్న అతిపెద్ద సినిమాల్లో మాస్టర్ ఒకటి. కరెక్ట్ గా విడుదల కావాల్సిన టైమ్ లోనే లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా వాయిదా పడి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కేవలం తమిళ్ ఆడియెన్స్ అనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా మాస్టర్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
నిధి అగర్వాల్ బ్యూటీఫుల్ ఫోటోషూట్.. మరింత శృంగారంగా అందాల గని..
ఇప్పటికే విడుదలైన పాటలకు అలాగే టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సరికొత్త లుక్ లో కనిపిస్తుండడం అలాగే ఖైదీ వంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజన్ ఆ సినిమాను డైరెక్ట్ చేయడం వలన భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

కటౌట్స్ తో పాటు సినిమా థియేటర్లు కూడా రెడీ చేసుకోవాలని నిన్న ఒక స్పెషల్ విసియోను రిలీజ్ చేయడంతోనే అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. ఇక సినిమాను జనవరి13న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తెలుగు తమిళ్ లో జనవరి13న విడుదల అవుతుండగా హిందీలో మాత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.