Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పది కోట్లు ఇస్తున్నారు... సినిమా కళాకారులకోసమే.., ఆ ఇద్దరు యువహీరోలూ
సమాజం లో ఏదైనా ఒక విపత్తు ఏర్పడ్దప్పుడు ఒక నటుడు విరాళం ప్రకటించటం మామూలే... సినిమా వాళ్ళ సంఖేమం కోసమే చేయాల్సిన పనుల కోసం ఇవ్వటమూ మామూలే అయితే తమ వంతుగా 5 కోట్లు ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా గొప్పవిషయమే అదీ ఒక్కొ సినిమాకి 10 కోట్లూ, 20 కోట్లూ తీసుకునే అగ్రహీరోలు కాదు వాళ్ళు . తమిళ హీరోలు విశాల్.. కార్తి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణం కోసం ఏకంగా రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. చెన్నైలో శుక్రవారం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు.

మాటలు చెప్పడం కాదు
మాటలు చెప్పడం కాదు.. చేతల్లోనూ తమ పనితనం చూపిస్తున్నారు తమిళ యువ కథానాయకులు విశాల్.. కార్తి. శరత్ కుమార్ నేతృత్వంలోని నడిగర్ సంఘం పెద్దలందరినీ ఎదిరించి.. గత ఏడాది ఎన్నికల బరిలో నిలవడమే కాదు.. అద్భుత విజయం సాధించిన విశాల్ వర్గం.. ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటనీ నెరవేరుస్తుండటంతో తమిళ ఇండస్ట్రీ జనాలే కాదు.. సామాన్య జనాలు కూడా వారిని అభినందిస్తున్నారు.

బ్యాంకు లోన్ తీర్చడం కోసం
ఆల్రెడీ నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టేసిన విశాల్ అండ్ కో.. దీని కోసం తెచ్చిన రూ.2 కోట్ల బ్యాంకు లోన్ తీర్చడం కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం.. ఆ మ్యాచ్ ద్వారా అంచనాల్ని మించి రూ.9 కోట్ల ఆదాయం సమకూరడం తెలిసిన సంగతే. రెండేళ్ల కిందటి ఎన్నికల్లో విశాల్.. కార్తి.. నాజర్ టీం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

నడిగర్ సంఘానికి భవనం
విశాల్ టీం ప్రధాన ఎన్నికల హామీ.. నడిగర్ సంఘానికి భవనం కట్టడం. ఇందుకోసం ఏడాది కిందటే చెన్నైలో భారీ ఎత్తున క్రికెట్ మ్యాచ్ నిర్వహించి.. రూ.9 కోట్ల దాకా నిధులు సమకూర్చుకున్నారు. మరికొన్ని విరాళాలు కూడా కలిపినా విశాల్ అండ్ టీం అనుకున్న స్థాయిలో భవనం నిర్మించడం కష్టమని తేలింది.

పేద కళాకారులకు
మొత్తం నిర్మాణ వ్యయం రూ.26 కోట్లుగా తేలింది. మరోవైపు పేద కళాకారులకు సంఘం తరఫున పెన్షన్లు అందించే పని కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఐతే అంతటితో ఆగకుండా చెన్నై శివార్లలో నడిగర్ సంఘం కోసం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆడిటోరియం నిర్మించాలని.. మొత్తం 110 ఎకరాల్లో కల్చరల్ బిల్డింగ్స్ కట్టాలని కూడా నాజర్ నేతృత్వంలోని సంఘం నిర్ణయించింది.

ఇంకా రూ.26 కోట్ల దాకా నిధులు
ఇందుకోసం ఇంకా రూ.26 కోట్ల దాకా నిధులు సమీకరించాల్సి ఉంది. ఇందుకోసం విశాల్-కార్తి కలిసి ఉచితంగా ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చక రూ.10 కోట్లు తమ జేబుల్లోంచి తీసివ్వడానికి విశాల్.. కార్తి ముందుకొచ్చారు.

వెయ్యిమంది సామర్ధ్యంతో
రజినీకాంత్.. కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ భవనంలో వెయ్యిమంది సామర్ధ్యంతో ఆడిటోరియం.. ప్రివ్యూ థియేటర్.. జిమ్.. డ్యాన్స్ స్కూల్.. ఎడిటింగ్-డబ్బింగ్-కంపోజింగ్ స్టూడియోలతో పాటు నడిగర్ సంఘం కార్యాలయం ఉంటాయట.