»   » రూమర్స్ పుట్టించకుంటే అదే నాకు వందగుళ్ళతో సమానం..

రూమర్స్ పుట్టించకుంటే అదే నాకు వందగుళ్ళతో సమానం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాట పాలరాతి బొమ్మగా వెలుగొందుతున్న తమన్నా, ప్రస్తుతం కోలివుడ్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నది. టాలీవుడ్ లో ఆమె నటించిన హ్యాపిడేస్ చిత్రం ద్వారా మంచి ప్రసంశలే అందుకొన్నా మొదట టాలీవుడ్ లో ఆశించినంతగా అవకాశాలు రాలేదు. అయితే తమిళులు తమన్నాను భాగా ఆదరించడంతో అక్కడ నిలదొక్కుకోగలిగింది. గతంలో కుష్బూ తెలుగు చలన చిత్రసీమ ఆమెను ఆదరించకపోవడంతో తమిళనాడులో నెం.1 స్థానంలో వెలుగొందింది. అదేవిధంగా మాలాశ్రీ కన్నడ చిత్రసీమలో నెం.1 గా వెలుగొందింది. ఇదే కోవలోకి తమన్నా చేరింది. ప్రస్తుతం తెలుగులో తమన్నా నాగచైన్య సరసన గీతాఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తోంది.

తమిళనాడులో సినీ అభిమానులకు ఒక ఆచారం ఉంది. తాము ఆరాదించే హీరోయిన్ లకు ఏకంగా గుడి కట్టి పూజలు పునస్కారాలు చేస్తారు. కుష్బూ, నమితాలకు ఇప్పటికే దేవాలయాలు కట్టేశారు. ప్రస్తుతం తమన్నాకు గుడికట్టాలని తమిళ తంబీలు ఆలోచిస్తున్నారు. ఇదే విషంపై తమన్నా స్పందిస్తూనేనేమైనా దేవతనా. నాకెందుకు గుడులు, గోపురాలు, మీ అభిమాన, ఆదరణ ఉంటే చాలంటున్నారు. తనపై లేనిపోని రూమర్లు పుట్టించకుండా అభిమానిస్తే అదే నాకు వందగుడులు కట్టినంత ఆనంద అని వినియంగా అంటున్నది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu