Don't Miss!
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Automobiles
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు.. బిగ్ బడ్జెట్ సినిమాతో బిగ్ టార్గెట్!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఇళయదలపతిగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న విజయ్ నెక్స్ట్ చేయబోయే 65వ సినిమా అంతకు మించి అనేలా ఉంటుందట. ఇప్పటివరకు ప్రభాస్ సౌత్ బిగ్గెస్ట్ పాన్ ఇండియక్ స్టార్ గా చక్రం తిప్పుతుండగా ఇప్పుడు విజయ్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. విజయ్ నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ వస్తాయట.

మాస్టర్ సినిమాతో బాక్సాఫీస్ హిట్
ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మాస్టర్ సినిమాతో వచ్చిన విజయ్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా పవర్ఫుల్ హిట్ కొట్టాడు. రెండు చోట్లా కూడా విజయ్ తన స్టార్ స్టామినా ఏమిటో చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ పెట్టిన పెట్టుబడులకు ప్రాఫిట్స్ అందిస్తాడాని ఎవరు ఊహించలేదు.

టాలీవుడ్ లో న్యూ టార్గెట్
తెలుగులో మాస్టర్ సినిమా 15కోట్ల బిజినెస్ చేసినప్పటికీ రానున్న రోజుల్లో విజయ్ సినిమాలు క్లిక్కయితే ఇక్కడ కూడా సరికొత్త సెనేషన్స్ క్రియేట్ చేయగలవని చెప్పవచ్చు. ప్రస్తుతం రజినీకాంత్ హవా గతంలో మాదిరిగా అయితే కనిపించడం లేదు. ఇక ఆయన తరువాత విజయ్ మాత్రం బలమైన మార్కెట్ సెట్ చేసుకోవడానికి టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

విజయ్ 65.. అసలైన పాన్ ఇండియా మూవీగా
ఇక విజయ్ 65వ సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ కానుందట. అసలైన పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అసలైతే 65వ సినిమాను మురగదాస్ తో చేయాల్సింది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. మురగదాస్ ను కాదని విజయ్ ఒక యువ దర్శకుడు చెప్పిన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో..
రోబో వంటి హిట్ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ విజయ్ 65వ సినిమాని నిర్మిస్తోంది. ఇక దర్శకుడు ఏవరంటే.. నయనతారతో కోలమావు కోకిల, శివకార్తికేయన్ తో డాక్టర్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్. ఈ దర్శకుడు ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో కథను రెడీ చేసినట్లు సమాచారం. అందుకే సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. మరి విజయ్ ఆ సినిమాతో ఏ రేంజ్ లో హిట్టు అందుకుంటాడో చూడాలి.