Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా తరువాత థియేటర్స్ లోకి రానున్న అతిపెద్ద సౌత్ సినిమా
కరోనా వైరస్ ఇంకా బ్రతికే ఉన్నప్పటికి జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. మునుపటి తరహాలోనే శుభకార్యాలు, వేడుకలలో భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. కరోనా తీవ్రత ఎంత ఉందో తెలియదు గాని భయం మాత్రం చాలా వరకు పోయిందనే చెప్పవచ్చు. ఇక థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇక సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సినిమా కూడా త్వరలో థియేటర్స్ లోకి రానుంది.
ఆ సినిమా మరేదో కాదు ఇళయదలపతి విజయ్ మాస్టర్ సినిమా. ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకులకు ముందుకు రావాల్సింది. కానీ అనుకోకుండా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఇక ఆ మధ్యలో ఓటీటీ రిలీజ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఓటీటీ సంస్థలు కూడా మాస్టర్ దక్కించుకోవాలని అనుకున్నాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా జనాల్లో కరోనా భయం పోతుండడంతో సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది.

2021 జనవరి 13న పొంగల్ కానుకగా మాస్టర్ ను విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని ఫెస్టివల్ సీజన్ లోనే సినిమాను విడుదల చేయాలని చర్చలు జరుపుతున్నట్లు పక్కా సమాచారం అందుతోంది. ఇక విజయ్ మాస్టర్ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలోనే ట్రైలర్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.