Kushbu Sunder కరోనా బారిన పడిన కుష్బూ.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్..

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను కరోనావైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తున్నది. పలు రంగాలకు చెందిన సినీ ప్రముఖులు కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, లక్ష్మీ మంచు లాంటి టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడితే.. తాజాగా యువ హీరోయిన్ ఇషా చావ్లాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సలహా మేరకు ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా స్వల్ప అనారోగ్యానికి గురైన ఇషా చావ్లా.. రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. నాతో సన్నిహితంగా ఉన్నవారు.. కరోనావైరస్ లక్షణాలు ఉంటే.. వెంటనే పరీక్షలు చేయించుకోండి. సామాజిక దూరం పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉండాలని కోరింది. ప్రజలు, అభిమానులు మాస్క్ ధరిస్తూ... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరలోనే కోలుకొని షూటింగులో పాల్గొంటాను. మీరు ఆందోళనకు గురికాకండి అంటూ ఇషా చావ్లా సోషల్ మీడియాలో వెల్లడించారు.

Kushbu Sunder, Isha Chawla tested coronavirus positive

ఇష్టా చావ్లా కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమ కావాలి చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన ఆమె 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటించింది. అలాగే 'పూలరంగడు', 'Mr పెళ్ళికొడుకు', జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక లాంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న "దివ్య దృష్టి" సినిమాలో ఇషా చావ్లా మెయిన్ లీడ్ గా నటిస్తుంది.

ఇదిలా ఉండగా, తమిళ నటి, రాజకీయవేత్త కుష్బూ సుందర్ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు కరోనావైరస్ పాజిటివ్ అని సోమవారం ఉదయం ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Kushbu Sunder, Isha Chawla tested coronavirus positive

కుష్పూ సుందర్ ట్వీట్ చేస్తూ.. ఎట్టకేలకు రెండు కరోనావైరస్ వేవ్స్ తర్వాత నన్ను కోవిడ్ పట్టేసింది. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతున్నాను. నిన్న సాయంత్రం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. నేను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒంటరిగా ఉండటానికి చాలా చిరాకుగా ఉంది. మరో ఐదు రోజులు ఒంటరిగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటాను . మీలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేసుకొండి అని కుష్పూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X