»   » కేక పుట్టించే విధంగా ముద్దు సీన్ (ఫోటో)

కేక పుట్టించే విధంగా ముద్దు సీన్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తన రాబోయే సినిమాలో హీరో విశాల్‌తో కలిసి కెరీర్లో తొలిసారి ముద్దు సీన్లో పాల్గొంది. 'నాన్ సిగప్పు మనితన్' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో స్క్రిప్టు డిమాండ్ మేరకే ఈ సీన్ పెట్టారట. తమిళ సినిమాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ రేంజిలో ఈ ముద్దు సీన్ చిత్రీకరించారట.

ఈ మద్దు సీన్ గురించి లక్ష్మీ మీనన్ మాట్లాడుతూ....దర్శకుడు తిరు సినిమా స్టోరీ నాకు చెప్పే సమయంలోనే ఇందులో ముద్దు సీన్ ఉంటుందని చెప్పారు. కథ డిమాండ్ మేరకే ఆ సీన్ పెట్టారు. నటనను ప్రొఫెషన్‌గా తీసుకున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు కూడా చేయాల్సి ఉంటుంది అన్నారు. భవిష్యత్‌లో స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లు చేయడానికి రెడీ అని స్పష్టం చేసింది.

Lakshmi Menon Shares Passionate Kiss With Vishal

సినిమా వివరాల్లోకి వెళితే....ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం హీరోయిన్ లక్ష్మీ మీనన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తుండటంతో ఈ ఆడియో వేడుకకు హాజరు కాలేక పోయింది. ఇంతకీ లక్ష్మీనన్ వయసు ఎంతో తెలుసా? కేవలం 17 సంవత్సరాలే.

'నాన్ సిగప్పు మనితన్' చిత్రం ఏప్రిల్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'కొచ్చాడయాన్'తో పోటీ పడుతూ విడుదలకు సిద్దం అవుతుండటం గమనార్హం. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

English summary

 Lakshmi Menon has done a kissing scene with her co-star Vishal Krishna in her forthcoming Tamil film Naan Sigappu Manithan. As the script demanded it, the actress is part of the smooch sequence
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu