twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతా కాపీనే...క్రియేటివిటీ ఎక్కడుంది?

    By Staff
    |

    Shahrukh Khan
    నిన్నటి దాకా తమిళ పరిశ్రమ కొత్త ఆలోచనలతో దూసుకుపోతోంది...అన్న వారంతా ఇప్పుడు కంగారుపడి తమ స్టేట్ మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు. దాదాపు షూటింగ్ లో ఉన్న ప్రతీ రెండు సినిమాల్లో ఒకటి హిందీ సినిమా కాపీ నే కావటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. మాధవన్ హీరోగా చేస్తున్న 'Guru En Aalu' సినిమా షారూఖ్ యస్ బాస్ చిత్రానికి,అజిత్ హీరోగా చేస్తున్న'Aegan' షారూఖ్ మై హూనా కి, విజయ్ దర్శకత్వంలో రెడీ అవుతున్న'Poi Solla Porom' చిత్రం కోస్లా కా గోస్లా సినిమాకి జెరాక్స్ కాపీలుగా తయారవుతున్నాయి.

    ఇక పి.వాసు తన కుమారుడు హీరోగా చేయనున్న చిత్రం షారూఖ్ బాజీగర్ నుండి,అలాగే ధనుష్ తో చేయనున్న చిత్రం జబ్ ఉయ్ మెట్ రీమేక్ కావటం జరిగుతోంది. ఇక ఇప్పటికి బయిట పడ్డ చిత్రాలు ఇవి అయితే ఇంకా తెలియని ఎన్ని సినిమాలు ఇప్పటికి కాపీలు జరుగుతున్నాయో అని సీనియర్స్,సినీ శ్రేయాభిలాషులు కంగారుపడుతున్నారు. ఈ ట్రెండ్ వల్ల తమదైన నేటివిటీ పోవటమే కాక,సృజనాత్మక శక్తి తగ్గిపోతుందని వారు వాపోతున్నారు. అయితే ఈ కాపీ ట్రెండ్ కి కారణం ముంబయి నుంచి వస్తున్న కార్పోరేట్ సంస్ధల నిర్ణయాలే అనే వాళ్ళూ లేకపోలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X