»   » లారెన్స్ అమ్మ ఆలయం ప్రారంభం రేపే : ఆవిష్కరించేది ఎవరంటే

లారెన్స్ అమ్మ ఆలయం ప్రారంభం రేపే : ఆవిష్కరించేది ఎవరంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, సామాజిక వ్యక్తిత్వం ఉన్న ఓ మంచి మనిషిగా, ఇలా ఎన్నో రంగాల్లో ఎందరో మనసులను గెలుచుకున్న లారెన్స్, తన తల్లి కోసం గుడి కట్టిస్తున్నాడు. తల్లి జీవించి ఉండగానే ఇలా గుడి కట్టించి విగ్రహ ప్రతిష్ట చేయడం ఒక్క లారెన్స్‌కే చెల్లింది. తను ఎంతగానో ఆరాధించే రాఘవేంద్ర స్వామి గుడి ఎదురుగానే తన తల్లికి గుడి కట్టిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు ఈ స్టైలిష్ కొరియోగ్రాఫర్.

తల్లి రుణం తీర్చుకోవడానికి

తల్లి రుణం తీర్చుకోవడానికి

తనను తొమ్మిది నెలలు మోసి, కని.. ఎన్నో కష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తన తల్లి రుణం తీర్చుకోవడానికి.. తల్లి గొప్పదనాన్ని లోకానికి చాటడానికి ఈ గుడి కట్టిస్తున్నట్లు లారెన్స్ తెలిపాడు. తాను కట్టిస్తున్న గుడిలో నెలకొల్పబోతున్న విగ్రహం తాలూకు ఫొటోను తన తల్లికి చూపిస్తే పరవశించిపోయిందని లారెన్స్ తెలిపాడు.

తల్లి కోసం కూడా ఓ గుడి

తల్లి కోసం కూడా ఓ గుడి

తన తల్లి తన కోసం పడ్డ కష్టాల్ని ఎప్పటికీ మరిచిపోని లారెన్స్ ఆమె కోసం ఎంతో చేశాడు. తనకిష్ట దైవం అయిన రాఘవేంద్రస్వామి గుడి కట్టించాడు. అంతటితో ఆగకుండా అదే గుడి ప్రాంగణంలో తన తల్లి కోసం కూడా ఓ గుడి కట్టబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా గుడి పూర్తి కావచ్చింది, ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతోంది.

సూపర్‌ సుబ్బరాయన్‌

సూపర్‌ సుబ్బరాయన్‌

స్థానిక అంబత్తూర్‌లో లారెన్స్‌ కొన్నేళ్ల క్రితం నిర్మించిన రాఘవేంద్ర ఆలయ ప్రాంగణంలో తల్లికీ గుడి కట్టించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు లారెన్స్‌ ప్రకటించారు.13 అడుగుల గాయత్రీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆ కిందనే లారెన్స్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

1000 మంది మాతృమూర్తులకు చీరలు

1000 మంది మాతృమూర్తులకు చీరలు

కెరీర్‌ ప్రారంభంలో కష్టాలో ఉన్న లారెన్స్‌ని సుబ్బరాయన్‌ మాస్టర్‌ ఆదుకున్నారు. ఆ అభిమానంతోనే తన తల్లి గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలు, ఆరుగురు మహిళారైతులకు సహాయం అందజేయనున్నారు.

English summary
Actor and dance director Radhava Lawrence is going to celebrate Mothers day in a massive manner. The actor has constructed a temple for his mother and he is going to open the temple tomorrow on the occasion of Mothers day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu