పీ సుశీల సరికొత్త ఘనత.. డాక్టర్ అనిత ఎంబీబీఎస్‌కు సంగీతం..

By Rajababu

ప్రముఖ నేపథ్య గాయని పీ సుశీల మధురమైన తన గానంతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను ఆకట్టుకొంటున్నారు. ప్రస్తుతం సుశీల కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఓ తమిళ చిత్రానికి సుశీల సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఒకవేళ అదే నిజమైతే తన సుదీర్ఘ సినీ జీవితంలో తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా మారే ఘనతను సొంతం చేసుకోనే అవకాశం కలుగుతుంది.

డాక్టర్ అనిత ఎంబీబీఎస్ అనే చిత్రాన్ని తమిళంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జూలీ అనే నటి ప్రధాన పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. తమిళ బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా జూలీ సుపరిచితులు. ఈ చిత్రాన్ని ఆర్జే పిక్చర్స్ రూపొందిస్తున్నది. ఓ కాలేజీ స్టూడెంట్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సుశీల సంగీత దర్శకత్వం వహించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Legendary singer P Susheela turn music director for Dr Anitha MBBS

డాక్టర్ అనిత ఎంబీబీఎస్ అనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. తామరపువ్వుపై కూర్చొని, చేతిలో పుస్తకం పట్టుకొన్న ఓ యువతి ఫొటోను ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X