Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20 ముందు టీమిండియాకు బూస్ట్.. డ్రెస్సింగ్ రూంలో లెజెండ్!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
విజయ్ తో లోకేష్ కనగరాజ్ మరో బిగ్ ప్లాన్.. ఈసారి ఎంతమంది హీరోలంటే?
కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లోకేష్ కనకరాజు పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. అతను క్రియేట్ చేస్తున్న మల్టీవర్స్ ప్లాన్ రానున్న రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ అయ్యేలా ఉందని అనిపిస్తుంది. ఇప్పటికే అతను విక్రమ్ సినిమాతో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో కమలహాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ నటించిన విధానం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సూర్య రోలెక్స్ పాత్రలో కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. ఇక కార్తీ క్ ఖైదీ క్యారెక్టర్ కూడా అందులో చూపించారు.
అయితే రాబోయే రోజుల్లో లోకేష్ తన సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏకం చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాస్టర్ క్యారెక్టర్ని కూడా అతను హైలెట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ విజయ్ 67 సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఆ సినిమాను మొదలుపెట్టారు. అక్కడికి విజయ్ చేతికి కడియం ధరించి వచ్చాడు. అంటే మాస్టర్ సినిమాలో ఉన్నట్లుగానే ఇందులో కూడా విజయ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే లోకేష్ మరో ఆరు మంది హీరోలను కూడా ఇందులో చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కమల్ హాసన్ తో పాటు సూర్య, కార్తీ, అలాగే విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ ఆ సినిమాలో కనిపిస్తారట. అంతేకాకుండా మరొక పవర్ఫుల్ పాత్ర కోసం సంజయ్ దత్ ను కూడా రంగంలోకి దింపాలని లోకేష్ ఆలోచిస్తున్నాడు. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతోనే విజయ్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
విజయ్ తన స్టార్ హోదా పెరిగిన తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు. కానీ లోకేష్ టాలెంట్ ను నమ్మి అతను ఇప్పుడు మిగతా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ 67వ సినిమాకు సంబంధించిన ప్రోమో కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.