twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ స్థాయిలో కుమారుడి ఘనత.. గర్వంతో పొంగిపోయిన మాధవన్!

    |

    "పుత్రొత్సాహము తండ్రికి.. పుత్రుడు జనియించినపుడు కలుగదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ.. పుత్రొత్సహంబు నాడు పొందుర సుమతీ!" అని సుమతీ శతకంలో చెప్పారు. ఇలాంటి ఆనందం ప్రముఖ సినీ నటుడు మాధవన్ అనుభవిస్తున్నారు.

    జాతీయ స్థాయి జూనియర్‌ స్విమ్మింగ్‌ పోటీలో నటుడు మాధవన్‌ కుమారుడు వేదాంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కొడుకు సాధించిన ఘనతను మాధవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ పొంగిపోయారు.

    నా కొడుకు నేను గర్వపడేలా చేశాడు

    నా కొడుకు నేను గర్వపడేలా చేశాడు

    ‘‘మీ అందరి ఆశీర్వాదం, శుభాకాంక్షలతో పాటు దేవుడి కృప ఉండటం వల్లనే నా కుమారుడు వేధాంత్ ఈ రోజు మేము గర్వపడే స్థాయికి వెళ్లాడు. జాతీయ జూనియర్ స్విమ్ మీట్లో మూడు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించాడు. త్వలోనే ఆసియా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనబోతున్నాడు'' అని మాధవన్ తెలిపారు.

    గతంలో అంతర్జాతీయ స్థాయిలో...

    గతంలో అంతర్జాతీయ స్థాయిలో...

    గతేడాది వేదాంత్ మాధవన్ ఇండియాకి తన తొలి అంతర్జాతీయ పతకం సాధించి పెట్టాడు. థాయ్‌లాండ్‌లో జరుగిన ఏజ్ గ్రూఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ 2018లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. 1500 మీటర్ల ప్రీ స్టైల్ విభాగంలో వేదాంత్ ఈ మెడల్ గెలుపొందారు.

    వేధాంత్‌కు ప్రశంసలు

    వేధాంత్‌కు ప్రశంసలు

    మాధవన్ కుమారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ దూసుకెళుతుండటంపై అభిమానుల నుండి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. పలువురు ఫ్యాన్స్, సినీ స్టార్స్ కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. వేదాంత్ భవిష్యత్తులో ఇలాంటి పతకాలు మరిన్నిసాధించి పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

    వేదాంత్ మాధవన్

    వేదాంత్ మాధవన్

    సరిత-మాధవన్ దంపతులకు వేదాంత్ 2005 ఆగస్టులో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 13 సంవత్సరాలు. చిన్నతనం నుండి వేదాంత్ స్మిమ్మింగ్ మీద ఆసక్తి చూపడంతో ఆదిశగా తల్లిదండ్రులిద్దరూ ఎంకరేజ్ చేశారు. వారి ప్రోత్సాహమే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అతడు పతకాలు సాధించేలా చేసింది.

    English summary
    "With all you Blessings, good wishes and Gods Grace ... Vedaant makes us very proud again.. 3 golds and a silver at the Junior Nationals Swim meet. His first individual National medals 🏅 . Asian next. Thank you so much to GAF MUMBAI and to all at the coaches and team members." Madhavan tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X