twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్కార్’ మూవీకి మరో షాక్... అభిమానుల్లో ఆందోళన, భారీ ఓపెనింగ్స్ కష్టమేనా?

    |

    స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో స్పెషల్ షోలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం సర్వసాధారణమే. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' మూవీ దీపావళికి విడుదలవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేశారు.

    తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో సినిమాను 24 గంటల పాటు విరామం లేకుండా నడిపించాలనే సన్నాహాలు సైతం చేస్తున్నారు. అయితే నవంబర్ 6న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. స్పెషల్ షోలు, అదనపు షోలు నిషేదిస్తూ మద్రాస్ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    ప్రజలు ఇబ్బంది పడతారంటూ కేసు

    ప్రజలు ఇబ్బంది పడతారంటూ కేసు

    దేవరాజ్ అనే సోషల్ యాక్టివిస్ట్ పండగ సీజన్లో స్పెషల్ షోలు రద్దు చేయాలని, అలాంటి షోల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ కోర్టును ఆశ్రయించారు. అతడి పిటీషన్ పరిశీలించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    ఓపెనింగ్స్ మీద ప్రభావం

    ఓపెనింగ్స్ మీద ప్రభావం

    స్పెషల్ షోలు రద్దు చేయడంతో ఓపెనింగ్స్ మీద భారీగా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరో వైపు స్పెషల్ షోలు, అదనపు షోలు రద్దు చేయడంతో ఇటు అభిమానుల్లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.

    కథ వివాదం కంచికి...

    కథ వివాదం కంచికి...

    రెండు రోజుల క్రితమే దర్శక నిర్మాతలు ‘సర్కార్' మూవీ స్టోరీ కాపీ వివాదాన్ని సెటిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. సర్కార్ స్టోరీ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అతడితో కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకుని టైటిల్ క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

    మురుగదాస్ ఏమన్నారంటే..

    మురుగదాస్ ఏమన్నారంటే..

    తాము రాసుకున్న కథలో కొన్ని పాయింట్లు ఒకేలా ఉన్నాయి, ఎవరి కథను ఎవరూ కాపీ కొట్టలేదు, అయితే ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచన వచ్చిన నేపథ్యంలో అతడికి టైటిల్ క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్లు దర్శకుడు మురుగదాస్ వెల్లడించారు. అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తానే అని మురుగదాస్ స్పష్టం చేశారు.

    విజయ్ సినిమా అంటే వివాదాలు తప్పనిసరి!

    విజయ్ సినిమా అంటే వివాదాలు తప్పనిసరి!

    తమిళంలో స్టార్ హీరో పొజిషన్లో ఉన్న విజయ్ తన గత సినిమాల విడుదల సమయంలోనూ ఏదో ఒక వివాదాన్ని ఫేస్ చేస్తూనే వస్తున్నారు. విజయ్ సినిమా అంటే వివాదాలు తప్పవనే పరిస్థితి వచ్చింది. ఇపుడు సర్కార్ విషయంలో కూడా అవి రిపీట్ అయ్యాయి. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తీ సురేష్ నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Madras High court has now banned the special shows of Sarkar on Diwali. The court acted upon the complaint filed by an activist named Devaraj. The court observed that special or extra shows should not be played during the festival times.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X