For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘సర్కార్’ కు ఊహించని షాక్... దానికి ఒప్పుకోనంటున్న మురుగదాస్, ఇక కోర్టులోనే!

  |

  విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కుతున్న 'సర్కార్' సినిమాకు సౌతిండియన్ ఫిల్మ్ రైట్స్ అసోసియేషన్ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా కథ తనదే అని, దాన్ని మురుగదాస్ కాపీ కొట్టాడంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్ చేస్తున్న వాదనకు మద్దతు ప్రకటించింది.

  2007లో వరుణ్ రాజేంద్రన్ రాసుకున్న స్క్రిప్టుకు, మురుగదాస్ 'సర్కార్' కోసం రాసుకున్న స్క్రిప్టు ఒకేలా ఉన్నాయని రచయితల సంఘం ధృవీకరించింది. ఓ వైపు సినిమా నవంబర్ 7న విడుదలకు సిద్ధమౌతున్న తరుణంలో ఈ వివాదం సినిమాను ఇబ్బందుల్లో పడేసింది.

  ఆ రెండూ ఒకేలా ఉన్నాయి

  ఆ రెండూ ఒకేలా ఉన్నాయి

  ‘సెంగోల్' టైటిల్‌తో తాను రాసుకున్న స్క్రిప్టును మురుగదాస్ కాపీ కొట్టారని వరుణ్ రాజేంద్రన్ ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరిపిన రచయితల సంఘం.... మురుగదాస్ మూవీ స్క్రిప్టు వరుణ్ రాసుకున్న స్క్రిప్టును పోలి ఉందని తేల్చారు.

  Vijay's Sarkar open BIGGER Than Prabhas' Baahubali 2 At The Box Office ?
  మురుదాస్ ఒప్పుకోలేదు

  మురుదాస్ ఒప్పుకోలేదు

  రచయితల సంఘం అధ్యక్షుడు కె భాగ్యరాజ్ ఈ విషయమై స్పందిస్తూ.. ‘వరుణ్ రాజేంద్రన్‌కు టైటిల్స్‌లో క్రెడిట్ ఇవ్వాలని అడిగాము. కానీ అందుకు మురుగదాస్ అంగీకరించలేదు. శివాజీ గణేశన్ రియల్ లైఫ్ ఎలక్షన్ కాంపెయిన్ నుంచి ఇన్‌స్పైర్ అయి తాను రాసుకున్నట్లు తెలిపారు. దీంతో మేము అతడికి మరో ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా చెప్పాం. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని సినిమా మొదట్లో వేయాలని కోరాం, దీంతో పాటు అదనంగా వరుణ్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలని కోరాం. ఈ రెండింటికీ మురుగదాస్ ఒప్పుకెలేదు. దీంతో మేము ఈ విషయంలో ఏమీ చేయలేక పోతున్నామని, మా సాధ్యమైనంత మేర ప్రయత్నించామని, ఇలా జరిగినందుకు చింతిస్తున్నామని వరుణ్‌కు లేఖ రాశాం.'' అని తెలిపారు.

  కోర్టు కెక్కిన వరుణ్ రాజేంద్రన్

  కోర్టు కెక్కిన వరుణ్ రాజేంద్రన్

  ఈ పరిణామాల నేపథ్యంలో రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్టుకు ఎక్కారు. మద్రాస్ హై కోర్టు ఈ కేసును అక్టోబర్ 30న విచారించనుంది. అయితే మురుగదాస్ మీద కాపీ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కత్తి సినిమా సమయంలో కూడా ఆయన కథపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.

  కోర్టులోనే తేల్చుకుంటామన్న మురుగదాస్

  కోర్టులోనే తేల్చుకుంటామన్న మురుగదాస్

  మురుగదాస్ స్పందిస్తూ రచయితల సంఘం అధ్యక్షుడు భాగ్యరాజ్‌ కేవలం వరుణ్ తరఫు వాదననే విన్నారు. మమ్మల్ని కలవలేదు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. ‘సర్కార్' కథ తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రావడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మేము కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.

  అది ఎలా సాధ్యం?

  అది ఎలా సాధ్యం?

  ఓట్ల దుర్వినియోగం ఎలా జరుగుతందనే అంశం మాత్రమే మా స్క్రిప్టులో సేమ్ టు సేమ్ ఉన్నాయి. వరుణ్‌ కథలో చాలా అంశాలు లేవు. నా కథలో ఇటీవల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూపించాం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి కూడా ఇందులో ఉంటుంది. వరుణ్‌ 2007లో కథ రాసుకుంటే? జయలలిత అంశం ఎలా ఉంటుంది? అని మురుగదాస్ ప్రశ్నించారు.

  రూ. 30 లక్షలు, క్రికెట్ ఇవ్వడానికి నో

  రూ. 30 లక్షలు, క్రికెట్ ఇవ్వడానికి నో

  కాగా... తాను కేసు విత్ డ్రా చేసుకోవాలంటే సినిమా టైటిల్‌లో క్రెడిట్ ఇవ్వాలని, దాంతో పాటు రూ. 30 లక్షలు చెల్లించాలని వరుణ్ రాజేంద్రన్ కోరినట్లు సమాచారం. అయితే అందుకు ససేమిరా అన్ని మురుగదాస్ కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకుంటామని చెప్పినట్లు సమాచారం.

  English summary
  Tamil film Sarkar had taken the headlines as the South Indian Film Writer's Association confirmed that the script of the movie is similar to that of Varun Rajendran’s 2007 movie Sengol's script. According to the latest development in Indian Express, the Madras High Court will be hearing the case on Tuesday,
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more