»   » ‘పులి’ వేడుకలో మహేష్ బాబు కూడా?

‘పులి’ వేడుకలో మహేష్ బాబు కూడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 31న జరిగే శ్రీమంతుడు తమిళ వెర్షన్ ‘సెల్వందన్' ఆడియో వేడుకలో పాల్గొనేందుకు చెన్నై వెలుతున్నారు. దీంతో పాటు ఆయన ఆగస్టు 2న జరిగే తమిళ మూవీ ‘పులి' ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలుస్తోంది. ‘పులి' ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాతలు మహేష్ బాబుతో పాటు మరికొందరు స్టార్లను ఆహ్వానించినట్లు సమాచారం.

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న సినిమా ‘పులి'. ఇందులో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక నటిస్తున్నారు. ప్రముఖ నటి శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమంతుడు చిత్రానికి ఆడియో అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ‘పులి' చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు.

Mahesh Babu to attend Puli audio launch?

‘పులి' చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట. షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
Tollywood actor Mahesh Babu, who is gearing up for the audio launch of Srimanthudu’s Tamil version Selvandhan on 31st July, is expected to attend the audio launch function of Tamil Superstar Vijay’s upcoming film, Puli.
Please Wait while comments are loading...