»   »  'నాన్‌దాండా పోలీస్‌'గా మహేష్ బాబు

'నాన్‌దాండా పోలీస్‌'గా మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'శ్రీమంతుడు' తమిళ వెర్షన్ 'సెల్వందన్' సక్సెస్ తో తో తమిళ పరిశ్రమలోనూ క్రేజ్‌ పెంచుకున్నాడు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. దాంతో ఆయన ఇప్పుడు 'నాన్‌దాండా పోలీస్‌' అంటూ త్వరలోనే మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు రావటానికి రంగం సిద్దం చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... తెలుగులో శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన 'ఆగడు' చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. అందులో మహేష్‌ పోషించిన పోలీసు పాత్రను బేస్ చేసుకుని 'నాన్‌దాండా పోలీస్‌' అనే టైటిల్‌ను పెట్టి విడుదల చేస్తున్నారు.

Mahesh Babu’s 'Aagadu' dubbed in Tamil

'శ్రీమంతుడు'ను కోలీవుడ్‌కి తీసుకొచ్చిన భద్రకాళి ఫిలింస్‌ బ్యానర్‌లోనే 'ఆగడు' డబ్బింగ్ అయ్యి విడుదల అవుతోంది. ఏఆర్‌కే రాజరాజన్ మాటలతో తమిళంలోకి అనువదిస్తున్న ఈ చిత్రం పాటలను సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు. తెలుగులో డిజాస్టర్‌గా మిగిలిన 'ఆగడు' తమిళ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలని టాలీవుడ్ ఎదురుచూస్తోంది.

English summary
Mahesh Babu’s flop film Aagadu dubbed in Tamil and released soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu