»   » టీజర్ లీక్ చేసిన వ్యక్తి అరెస్టు

టీజర్ లీక్ చేసిన వ్యక్తి అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ నటుడు విజయ్‌ నటించిన 'పులి' చిత్ర ఫస్ట్‌లుక్‌ ని సోమవారం అంటే ఈ రోజు రాత్రి 12 గంటలకు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు. అయితే అంతకుముందే ...సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వైరల్ లాగ రిలీజై ముందుకు వెళ్లింది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా గిప్ట్ గా ఇద్దామని అనుకుంటే ముందే విడుదల అయ్యి టీమ్ ని పూర్తిగా నిరాశపరిచింది. దాంతో పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ లు ఎలర్టై వెంటనే...ఫోర్ ఫ్రేమ్స్ ప్రివ్యూ ధియోటర్ లో పని చేస్తున్న MS. Midhun అనే వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక పస్ట్ లుక్ విషయానికి వస్తే.... పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ నేడు విడుదల చెయ్యనున్నారు.చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు ఇక్కడ టీజర్ చూడవచ్చు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.

చింబుదేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇది కాకుండా విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

Man behind Puli teaser leakage arrested

ఇక ఈ చిత్రంలో శ్రీదేవి ప్రత్యేక పాత్రోలో కనిపించనుంది. ప్రముఖ నటి శ్రీదేవి దక్షిణాదిన పునరాగమనం చేస్తున్న చిత్రర 'పులి'. చింబు దేవన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శింబు, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట.

షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

English summary
The makers have planned to release Vijay’s upcoming fantasy thriller ‘Puli’ teaser on midnight of June, 22nd as a gift to Vijay’s fans on his birthday. But the leakage has disappointed the team and with no option left makers had released the official teaser. Meanwhile the man behind this leakage was MS. Midhun, an intern who works in Four Frames preview theatre. He was arrested by cops.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu