twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నీలం' తుఫానుని షూట్ చేసి వాడుతున్న మణిరత్నం

    By Srikanya
    |

    చెన్నై : గత నాలుగు రోజులుగా 'నీలం' తుపాను కారణంగా దేశం అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తుఫాన్ ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. 'విలన్‌' చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అంచనాల చిత్రం 'కడలి‌'. ఇందులో కార్తి కుమారుడు గౌతం, రాధ రెండో కుమార్తె తులసి జంటగా నటిస్తున్నారు. అరవింద్‌స్వామి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. జాలర్ల జీవిత నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    కడల్‌' చిత్ర కథ ప్రకారం క్లైమాక్స్ లో తుపాను సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియను కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. ఇంతలో వచ్చిన 'నీలం' తుపానును తన సినిమాకు వినియోగించుకున్నారు మణిరత్నం. సముద్రతీరంలో సుమారు గంటపాటు కీలకఘట్టాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీనిపై అ్రవింద్‌స్వామి తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'కడల్‌' కోసం నిజమైన తుపానులో గంటపాటు చిత్రీకరణలో పాల్గొనడం ఎప్పటికీ మరిచిపోలేని అంశమని ప్రస్తావించారు.

    సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు. మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది.

    మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.

    English summary
    When the cyclone stormed this week, apparently, Mani Ratnam, who was planning to shoot some vital scenes in such climatic settings, made use of Nialm. Sources say that Mani Ratnam and his crew shot some scenes near Kasimedu and Royapuram surroundings in the cyclone. Aravind Swami, who is playing an important role in the film confirmed this news by sharing on his micro blogging site. "Awesome experience of shooting in cyclonic weather in the sea for a sequence in Kadal," (sic) he posted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X