twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నానికి చేదు అనుభవం.. విజయ్‌కి ఝలక్.. ఫేస్‌బుక్‌లో సారీ!

    By Rajababu
    |

    ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నై స్థానికుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కోవాలం బీచ్‌లో చెక్క చివంతా వానం అనే చిత్ర షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొన్నది. కోవాలం బీచ్‌లో షూటింగ్ అనంతరం పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలిగించిన తర్వాతనే షూటింగ్ ప్యాక్ ఆప్ చేయాలని సర్ఫింగ్ క్రీడాకారులు నిలదీశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీచ్ ప్రాంతాన్ని క్లీన్ చేసి వెళ్లాల్సి వచ్చింది.

    చెన్నై బీచ్‌లో షూటింగ్

    చెన్నై బీచ్‌లో షూటింగ్

    చెన్నైలోని కోవాలం బీచ్‌లో ప్రతీ రోజు స్థానికులు సముద్రంలో సర్ఫింగ్ చేస్తుంటారు. సర్ఫింగ్ క్రీడాకారులు కమ్యూనిటీ సముద్ర తీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొంటారు. దాదాపు 40 మంది వాలంటీర్లు సముద్ర తీరాన్ని శుభ్రం చేసే పనిలో ఉంటారు. ఈ క్రమంలో విజయ్ తన 62వ చిత్రంతోపాటు మణిరత్నం తన తాజా సినిమా షూటింగ్‌ను ఆ ప్రాంతంలో నిర్వహించారు.

    పగిలిన గాజులు, తూటాలు

    పగిలిన గాజులు, తూటాలు

    విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమా యూనిట్లు కోవాలం బీచ్‌లో ఇటీవల యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం పగిలిన సీసాలు, ఇతర విరిగిపోయిన వస్తువులు, గాజు ముక్కలు బీచ్‌లో ఎక్కువగానే పడ్డాయి. వాటిని క్లీన్ చేయకుండా షూటింగ్ ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని వాలంటీర్లు అడ్డుకొన్నారు. బీచ్‌లో పడి ఉన్న చెత్త, చెదారాన్ని, శకలాలను తొలగించాలి అని సూచించారు.

     శుభ్రం చేయకుండానే

    శుభ్రం చేయకుండానే

    ఈ సందర్బంగా ఓ సర్పింగ్ కోచ్ మీడియాతో మాట్లాడుతూ.. మణిరత్నం గాజు, ఇతర వాటితో షూట్ చూశారు. దాంతో బీచ్ అంతా చిన్న చిన్న గాజు ముక్కలతో నిండిపోయింది. బీచ్ అనేది ప్రజలు రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్. అలాంటి ప్రదేశంలో షూట్ చేస్తారా? యాక్షన్ సీన్లకు అవుట్‌డోర్‌లో చేసుకోవాలి. గాజ ముక్కలను బీచ్‌లో వదిలి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాం అని అన్నారు.

    బీచ్‌లో 40 వాలంటీర్లు

    బీచ్‌లో 40 వాలంటీర్లు

    సాధారణంగా కొంత డబ్బును కలెక్ట్ చేసి బీచ్‌ను శుభ్ర పరచడానికి ఉపయోగిస్తాం. దాదాపు 40 మందికి పైగా వాలంటీర్లు ఈ పనిలో ఉంటారు. సందర్శకులకు ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకొంటాం. సినీ ప్రముఖులకు ఇవేమీ పట్టడం లేదు అని మరో స్థానికురాలు పేర్కొన్నారు.

     విజయ్ క్షమాపణ

    విజయ్ క్షమాపణ

    బీచ్ శుభ్రతపై స్థానికులు స్పందించడంతో నటుడు విజయ్ రియాక్ట్ అయ్యారు. తన ఫేస్‌బుక్‌ ద్వారా ఆయన క్షమాపణలు చెప్పారు. అలాగే మద్రాస్ టాకీస్ ప్రతినిధి కూడా మాట్లాడుతూ.. ఎక్కడైనా షూట్ చేస్తే ఆ పరిసర ప్రాంతాలను శుభ్రపరచడానికి ఓ టీమ్ ఉంది. షూటింగ్‌కు ముందు ఉండే పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకొంటాం. కోవాలం బీచ్‌లో చిన్న పొరపాటు జరిగింది అని అన్నారు.

    English summary
    The volunteers allege that two movie shoots, Vijay's Thalapathy 62 and Mani Ratnam's Chekka Chivantha Vaanam, took place recently at the Kovalam beach and that was when the trouble began. The surfers do add that they are okay with people using the beach for shoots but they also urge people to clean up after themselves.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X