»   » మహేష్ బాబుకి మనవాళ్ళకన్నా తమిళ తంబీలే ఎక్కువా?

మహేష్ బాబుకి మనవాళ్ళకన్నా తమిళ తంబీలే ఎక్కువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ ని మీరు మల్టి స్టార్ చిత్రాలు చేయరేంటి అని అడిగితే...నా ఫ్యాన్స్ కి అది నచ్చదు. అయినా ఈ రోజుల్లో అది జరిగే పనికాదు.మా నాన్నగారి రోజులు వేరు అని చెప్పుకొచ్చాడు. అదే తమిళంలో ఇప్పుడు విజయ్, ఆర్య నటిస్తున్నా వారితో కలిసి నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మణిరత్నం దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో మహేష్ తో పాటు మరో ఇద్దరు హీరోలు చెయ్యనున్నారు. దాంతో ఇప్పుడు మహేష్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాడు. మణిరత్నం తాజా చిత్రంలో నటించటం గర్వ కారణమన్న ఈ స్టార్ తెలుగులో కూడా మల్టి స్టార్ చిత్రాలు ఒప్పుకోవచ్చు కదా అంటున్నారు.

ఇంతకుముందు రెండు ఆఫర్స్ తెలుగులోని అగ్ర దర్శకుల దగ్గరనుండి వచ్చినా మల్టి స్టార్ సినిమా అని వద్దన్నాడు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో 'రోబో" చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సన్ పిక్చర్స్ తమిళ,తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం అమర్ కల్కి రచించిన 'పొన్ని యన్‌ సెల్వన్‌" అనే నవలను సన్‌ పిక్చర్స్‌ ఎంచుకుంది.

ఐదు సంపుటాల నవలను కేవలం 80 సీన్లతో మణిరత్నం చక్కని స్క్రిప్ట్‌గా మలిచారని సమాచారం.ఇక ప్రస్తుతం మహేష్..శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.మహేష్ సరసన తొలిసారిగా సమంత కనిపించనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

English summary
Mani Ratnam had planned a epic film to be made with Rs.200crores budget is ‘Ponniyan Selvan’ which has been the talk of entire India. Mahesh getting the lead role in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu