Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాస్టర్ సినిమాకు పైరసీ పోటు.. సోషల్ మీడియాలో కీలక సన్నివేశాలు.. వేడుకుంటున్న దర్శకుడు
కోవిడ్ లాక్ డౌన్ తరువాత కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న బిగ్గెస్ట్ మూవీ మాస్టర్. గతంలో ఎప్పుడు లేని విదంగా తలపతి విజయ్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో సినీ ప్రముఖులు మొత్తం ఈ సినిమా ఓపెనింగ్స్ పైనే ఫోకస్ పెట్టారు. అయితే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పైరసీకి గురి కావడం అందరిని షాకింగ్ కు గురి చేసింది. భయంతో చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

పాన్ ఇండియా అనేలా..
కరోనా లాక్ డౌన్ అనంతరం అందరి చూపు ఎక్కువగా విజయ్ మాస్టర్ సినిమాపైనే ఉంది. ఈ సారి విజయ్ దాదాపు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనేలా తన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేమికులు మాస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.

రెండు రోజుల ముందే పైరసీ దెబ్బ
లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమాకు మొదటి నుంచి కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఇక తమిళ్ తెలుగు భాషల్లో జనవరి 13న విడుదల కాబోతుండగా హిందీలో మాత్రం జనవరి 14న విడుదల అవుతోంది. అయితే రెండు రోజుల ముందే సినిమాపై పైరసీ దెబ్బ పడటం హాట్ టాపిక్ గా మారింది.

డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
ఇక దర్శకుడు ఈ విషయంపై చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మాస్టర్ సినిమా మీ ముందుకు రావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. దయచేసి లీకైన వీడియోలు మీ వరకు వస్తే షేర్ చేయవద్దు.. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.. అంటూ దర్శకుడు వివరణ ఇచ్చాడు.

అర్ధరాత్రి నుంచే వైరల్..
ఆదివారం అర్ధరాత్రి నుంచే మాస్టర్ సినిమా ఇంటర్వెల్ సీన్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా చిన్న చిన్న క్లిప్పింగ్స్ వైరల్ అవుతుండగా చిత్ర నిర్మాణ సంస్థ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎవరైనా వీడియోలు లీక్ చేసినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఇక అభిమానులు కూడా భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు.