»   »  విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన మీరా

విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన మీరా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Vasudevan
చెన్నయ్ లో మరో సినిమా జంట కోర్టుకు ఎక్కింది. హీరోయిన్ మీరా వాసుదేవన్, కెమరామెన్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ ను 2005లో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా మీరా వాసుదేవన్ సినిమాలలో, టీవీ సీరియళ్లలో నటించడం కొనసాగించింది. మోహన్ లాల్ తో కలిసి నటించిన మలయాళ సినిమా తన్మత్ర సినిమా సూపర్ హిట్ కూడా అయింది. దీనితో ఆమె తన దృష్టిని మలయాళ సినిమాపైనే ఎక్కువగా కేంద్రీకరించింది. హిందీలో తన భర్తే స్వయంగా నిర్మించనున్న సినిమాలో కూడా నటించాల్సి ఉంది. ఇదిలా ఉండగానే గత సంవత్సరం నుంచి ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తన ఆస్థిని తన భర్త తాకట్టు పెట్టాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. తనను ఇబ్బందుల పాల్జేస్తున్నాడని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా తన లాయర్ తో ఫ్యామిలీ కోర్టులో భర్తనుంచి విడాకులు కోరుతూ మరో ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్న భర్తనుంచి రూ.50 లక్షల నష్టపరిహారాన్ని కూడా ఇందులో కోరింది. 2007 సంవత్సరంలో సినిమా జంటల విడాకుల కేసులతో నడిచిన చెన్నయ్ ఫ్యామిలీ కోర్టుకు నూతన సంవత్సరంలోనూ ఈ బెడద తప్పేట్టు లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X