»   » షూటింగ్‌స్పాట్‌లో ఇద్దరూ హీరోలు సర్దుకు పోయారు

షూటింగ్‌స్పాట్‌లో ఇద్దరూ హీరోలు సర్దుకు పోయారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : 'తలైవా'(అన్న)తో ఆకట్టుకున్న విజయ్ ప్రస్తుతం 'జిల్లా'లో నటిస్తున్నాడు. కాజల్‌ హీరోయిన్. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.చిత్రీకరణ సగం పూర్తయింది. విజయ్‌ నటించిన 'వేలాయుధం'కి సహాయ దర్శకుడిగా పనిచేసిన నేసన్‌ మెగాఫోన్‌ పట్టుకుంటున్నాడు. ఈ చిత్రం గురించి,అందులో విశేషాలు గురించి మీడియాతో దర్శకుడు మాట్లాడారు.

విజయ్‌, కాజల్‌ జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం 'జిల్లా' హాస్పిటల్‌, ఎం.పి బిల్డింగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. మోహన్‌లాల్‌, విజయ్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఆర్టీ నేసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.బి.చౌదరి నిర్మాత. ఈ నెల 12 వరకు చిత్రీకరణ జరుగుతుంది. దీంతోపాటు 'కెహి జోనే భలలాగారి' సినిమా చిత్రీకరణ యు.బిల్డింగ్‌ ఎదురు రోడ్‌లో జరుగుతోంది.

దర్శకుడు నేసన్ మాట్లాడుతూ...: ఈ పేరునే టైటిల్ గా ఎందుకు ఎంచుకున్నారో చెప్తూ... సినిమా చిత్రీకరణ ప్రదేశాలను చూసేందుకు విజయ్‌తో కలసి మదురై వెళ్లాం. అప్పుడు అక్కడో వ్యక్తిని అందరూ 'జిల్లా.. జిల్లా' అంటూ పిలిచారు. ఓ గ్రూపులో చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండే వ్యక్తిని 'జిల్లా' అనే పిలుస్తారట. ఆ విషయాన్ని విజయ్‌కి చెప్పాం. 'అరె బాగుందే.. ఆ పేరే పెట్టేద్దాం..' అన్నారు. అలా ఈ పేరొచ్చింది.

ఇక అశోక్‌- విశాఖ జంటగా 'మురుగా' తెరకెక్కించా. పెద్దగా ఆడలేదు. మంచి అవకాశం కోసం వేచి చూశా. ఆ తర్వాత 'వేలాయుధం' చిత్రానికి పనిచేస్తుండగా విజయ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయనకు రెండు కథలు వినిపించాను. అందులో ఒకటి 'జిల్లా'. విజయ్‌ నటిస్తానని అంగీకరించారు. అలా తెరపైకి వచ్చిందీ కథ. కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు 'ఇలయ తలబది' విజయ్‌ అభిమానులు. అందుకు తగ్గట్టుగానే విజయ్‌ కూడా ఒక సినిమా విడుదల కాకముందే కొత్త చిత్రం సన్నాహాలు ప్రారంభిస్తాడు. అలా ఈ చిత్రం మొదలైంది అన్నారు.


మోహన్‌లాల్‌, విజయ్‌.. ఇలా ఇద్దరు పెద్ద మాస్‌ హీరోలను చాలా సంతోషంగా ఉంది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకునేటప్పుడు మోహన్‌లాల్‌ సినిమాలను చూసి చాలా విషయాలను నేర్చుకునేవాణ్ని. కథ చెప్పేటప్పుడే ఓ పాత్రకు తప్పనిసరిగా మోహన్‌లాల్‌ గారిని నటింపజేయాలని కోరాను. కథ చాలా బాగుందని విజయ్‌, నిర్మాత ఆర్‌బీ చౌదరి చెప్పారు. వెంటనే లాల్‌ను ఒప్పించారు. ప్రారంభంలో నేను కూడా భయపడ్డా. ఇద్దర్నీ ఎలా మోయగలమని..! చిత్రీకరణలో ఏ సమస్యా రాలేదు. స్కిప్టులో ఇద్దరికీ విడివిడిగా సన్నివేశాలను సమంగా పంచా. అయినా ఎక్కడో సందేహం.. ఏమవుతుందోనని. షూటింగ్‌స్పాట్‌లో ఇద్దరూ సర్దుకు పోవడం చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. ఒకరి షూటింగ్‌ జరిగేటప్పుడు మరొకరు వేచి ఉండేవారు. చాలా సరదాగా సాగుతోంది అన్నారు.

'తలైవా' తర్వాత విజయ్‌ చిత్రాలపై అంచనాలు వేరేలా ఉన్నాయి. అయినా ఇందులో ఏమాత్రం రాజకీయ అంశాలు లేవు. రెండేళ్ల కిందట నేను అనుకున్న సాధారణ కథే ఇది. 'జిల్లా' పూర్తి కమర్షియల్‌ చిత్రం. ఇక 'తలైవా' సమస్య గురించి విజయ్‌ మీ వద్ద ప్రస్తావించలేదు. ఈ సమస్య తారాస్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. 'జిల్లా'కు కావాల్సిన హావభావాలు మాత్రమే ఆయనలో కనిపించాయి. చాలా సాధారణంగా ఉండేవారు. 'మనవల్ల ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారే..' అనే బాధమాత్రం కనిపించింది. 'షాట్‌ రెడీ..' అనే మాట వినగానే మిగిలిన అన్ని విషయాలను మరిచిపోతారు విజయ్‌ అంటూ చెప్పుకొచ్చారు.

English summary
Jilla has Vijay, Kajal Aggarwal, Mohanlal, Mahat Raghavendra, Parotta Suri and Vidhyum Raman in the pivotal roles. The movie is produced by RB Choudary under Super Good films, and it is directed by RT Neason. D Imman has scored the music and cinematography is by Nutty Natraj.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu