»   »  నటి అల్ఫోన్సాపైన తల్లి పోలీస్ కంప్లైంట్

నటి అల్ఫోన్సాపైన తల్లి పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఈ మధ్య కాలంలో ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తున్న అల్ఫోన్సా మరోసారి వార్తలుకు ఎక్కారు. ఆమెపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త జయశంకర్‌తో కలిసి చెన్నై వళసరవాక్కంలోని తల్లి ఓమనా ఇంట్లో ఆమె కొన్నాళ్లు నివసించారు. ఆ సమయంలో సినిమా అవకాశాలు లేకుండా ఇంట్లో ఉన్న అల్ఫోన్సా తనను వేధింపులకు గురిచేస్తోందని వళసరవాక్కం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేశారు.

ఈ పరిణామాలతో అల్ఫోన్సా ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఆమె మళ్లీ ఇంటికి వచ్చి తనపై దాడి చేసిందని, ఇంట్లోని సామగ్రి బయట పడేసిందని వళసరవాక్కం పోలీసులకు ఓమనా సోమవారం ఫిర్యాదు చేసింది. రజనీకాంత్‌ నటించిన 'బాషా', కమలహాసన్‌ నటించిన 'పంచతంత్రం' తదితర సుమారు 40 చిత్రాల్లో అల్ఫోన్సా నటించారు.

గతంలోనూ...

తన భర్త జయశంకర్‌ను అల్ఫోన్సా అపహరించడానికి ప్రయత్నిస్తున్నారని సుమిత్ర అనే మహిళ సైదాపేటలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అరెస్టుకు భయపడి అల్ఫోన్సా ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేసుకున్నారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్‌ ఎమ్‌.ఎమ్‌.సుద్రేశ్‌ విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Mother gave a police Compliant on Alphonsa


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కేసు వివరాల్లోకి వెళితే...

నటి అల్ఫోన్సా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అల్ఫోన్సా తన భర్తను అపహరించిందంటూ మైలాడుదురైకు చెందిన సుజాత అనే ఓ మహిళ (అసలుపేరు కాదు) పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె బుధవారం నగర పోలీసు కమిషనర్ జార్జ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పలు భాషల్లో శృంగార తారగాను, వివిధ పాత్రల్లోనూ నటించిన అల్ఫోన్సా ...రజనీకాంత్ నటించిన భాషా చిత్రంలో రా...రా..రా.. రామయ్య పాట ద్వారా ప్రాచుర్యం పొందారు.

కాగా తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ అల్ఫోన్సాపై ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. చెన్నై సైదాపేటలో నివసిస్తున్న తన భర్త జయశంకర్‌ను అల్ఫోన్సా అపహరించిందని, ప్రస్తుతం ఆమె తనను ఫోన్లో చంపుతానని బెదిరిస్తోందని సుజాత తన ఫిర్యాదులో తెలిపింది. ఎనిమిదేళ్లుగా తాను జయశంకర్ ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.

'అలాంటిది అల్ఫోన్సా ఫోన్‌లో నీకంటే ముందే జయశంకర్‌ను నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి నువ్వు అతన్ని వదలి పారిపోలేదంటే చంపుతానంటూ బెదిరిస్తోందని' తెలిపింది. సుజాత తన ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలను పోలీస్ కమిషనర్‌కు అందించింది. అందులో అల్ఫోన్సా, జయశంకర్ సన్నిహితంగా ఆడిపాడే సన్నివేశాలు వీడియోతోపాటు తన పెళ్లి ఫోటోలు ఉన్నాయి. సుజాత ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ జార్జ్ దర్యాప్తుకు ఆదేశించారు. అడయారు అసిస్టెంట్ కమిషనర్, కన్నన్ ఆధ్వర్యంలో సైదాపేట పోలీసులు ఈ కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు.

English summary
Actress and item girl Alphonsa's mother file a plolice case on her. The actress, who lives separated from her husband with her daughter, was involved in a ‘live-in’ relationship with dance choreographer Vinod Kumar.
Please Wait while comments are loading...