»   » సెక్సవల్ వేధింపులపై మాట్లాడిన హీరోయిన్ 'నమిత',మిగతా సెలబ్రెటీలు చెప్పరని దెప్పింది

సెక్సవల్ వేధింపులపై మాట్లాడిన హీరోయిన్ 'నమిత',మిగతా సెలబ్రెటీలు చెప్పరని దెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అత్యాచారాల గురించి వేదికలపై ఎవరూ మాట్లాడడంలేదు, తాను మాత్రం వాటి గురించి గొంతెత్తుతానని నటి నమిత వ్యాఖ్యానించటం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నమిత త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తాని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత చేకూరింది.

నమ్మి మోసపోయా..అరెస్ట్ చేయాలంటూ నమిత

స్టార్ హీరోయిన్ గా వెలిగి, అనంతరం సెక్సీ హీరోయిన్ గా యూత్ ని ఆకట్టుకున్న నమిత , తన శరీరాన్ని కంట్రోలు చేసుకునేందుకు గ్యాప్ తీసుకున్నానని గత కొంతకాలంగా వెండితెరకు దూరమయ్యారు. అయితే రీసంట్ గా మోహన్ లాల్ నటించిన పులి మురగన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆమెకు మళ్లీ ప్రయారిటీ ఏర్పడింది.

మళయాళంలో వరస పెట్టి ఆఫర్స్ అందుకుంటున్న ఈ బొద్దుగుమ్మ ఓ చిత్రం ఆడియో పంక్షన్ కు హాజరయ్యి..పిల్లలు..వారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు విషయమై అందరూ గొంతు విప్పి పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. తల్లితండ్రులు కూడా ఈ విషయమై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. అందుకు సంభందించిన వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

అమ్మా అప్పా సినీ క్రియేషన్‌స పతాకంపై పళనీవేల్ కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రం ఛాయ. నటి సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిణిగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి పార్తిబన్ ఛాయాగ్రహణం, ఏసీ.జాన్ పీటర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది. తమిళ నటుడు శ్రీకాంత్ అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ను ఆవిష్కరించారు.

రెండే మార్గాలు అంటూ...

రెండే మార్గాలు అంటూ...

నమిత మాట్లాడుతూ.. సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలంటే రెండే మార్గాలన్నారు. ఒకటి సినిమా, రెండు రాజకీయాలు.అందుకే తాను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నానన్నారు. ఓ విధంగా ..తను రాజకీయాల్లోకి రాబోతున్నాననే విషయాన్ని ఈ విధంగా ఆమె స్పష్టం చేసారు.

అత్యాచారాలు ఎక్కవ.

అత్యాచారాలు ఎక్కవ.

సమాజంలో పిల్లలపై అత్యాచారాలు అధికం అవుతున్నాయన్నారు. వాటి గురించి ఏ వేదికపైనా ఎవరూ మాట్లాడడం లేదని, తాను అలాంటి చర్యలను ఖండిస్తూ గొంతెత్తుతానని అన్నారు. అవసరమనుకుంటే ఖచ్చితంగా ఈ విషయమై పోరాటం సైతం చేస్తానని అన్నారు.

నేనే చూసుకుంటాను

నేనే చూసుకుంటాను

తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను మాత్రం అందిస్తే చాలదన్నారు. వారితో సన్నిహితంగా మెలుగుతూ సమాజం గురించి తెలియజేయాలన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అదే విధంగా తన సోదరుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి బాధ్యతలు తానే చూసుకుంటానని నమిత తెలిపారు.

సెక్సవల్ గా ..

సెక్సవల్ గా ..

ఈ సమయంలో తల్లితండ్రలు మరింత భాధ్యతగా మెలగాలి. ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు సెక్సవల్ గా వేధింపులకు గురి అవుతున్నారు. గమనించాల్సిన మరో విషయం ఏమిటి అంటే...ఆ వేధింపులకు గురి చేస్తోంది కుటుంబంలోని వారే .

మీరు కూడా వేధింపులకు...

మీరు కూడా వేధింపులకు...

మీలో చాలా మంది సెక్సవుల్ గా చిన్నప్పుడు వేధింపులుకు గురి అయ్యి ఉండవచ్చు. ఇందుకు వయస్సుతో సంభందం లేదు. అదే తల్లితండ్రులు పిల్లల చదువుమీదే కాకుండా ఇలాంటి విషయాల మీద కూడా దృష్టి పెడితే ఖచ్చితంగా మార్పు వస్తుందని అని నమిత ఈ ఆడియో వేడుకకు వచ్చిన జనాలని ఉద్దేసించి అన్నారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్

గుడ్ టచ్, బ్యాడ్ టచ్

మనం మన పిల్లలకు గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ ఏమిటో స్పష్టంగా తెలియచేయాలి. వారి భాషలోనే వారికా విషయాలు తెలియచేయాలి. వారికి అర్దమయ్యేటట్లు స్పష్టంగా వివరించాలి. తల్లితండ్రులు కూర్చుని ఓపికగా ఇవన్నీ చెప్పుకుని పిల్లను ఎడ్యుకేట్ చేయాలి.

అమాయికమైన ఫేస్ లు చూసినప్పుడు..

అమాయికమైన ఫేస్ లు చూసినప్పుడు..

నా మాటలు విని మీరు నేనేదో ఈ విషయాల్లో ఎక్సపర్ట్ ని అనుకుంటారేమో , అంత లేదు. నాకు మూడు కుక్క పిల్లలు ఉన్నాయి. నేను డాగ్ పేరెంట్ ని. నేను ఆ చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వాటి అమాయికమైన ముఖాలు చూసినప్పుడల్లా సురిక్షతమైన సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని వివరించారామె.

వివాదం కాబట్టి...

వివాదం కాబట్టి...

ఇక ఇలాంటి సున్నితమైన విషయాలు మిగతా సెలబ్రెటీలు ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే వివాదాలు వస్తాయని వారు భయపడతారు. కానీ నేను అలాంటివన్నీ దాటేసాను. నాకు పిల్లలు ముఖ్యంగా. వారు హ్యాపీగా ఉండటం నాకు ఆనందాన్ని ఇస్తుంది అని వివరించింది నమిత.

అందుకే ఆ పార్టీలో

అందుకే ఆ పార్టీలో

నమిత అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు జయలలిత సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. తిరుచ్చిలో జరిగిన బహిరంగ సభలో ఆమెకు జయలలిత పార్టీ సభ్యత్వం ఇచ్చారు. తనకు అన్నాడీఎంకే పార్టీలో చేరాలని ఉందని, ఆ మేరకు అవకాశం కల్పించాలని నమిత జయలలితకు లేఖ రాశారు. అందుకు జయలలిత సుముఖత వ్యక్తం చేశారు. దీంతో తిరుచ్చి వెళ్లిన నమిత.. అక్కడ అన్నాడీఎంకే సభ్యత్వం తీసుకున్నారు.

బావలు, మరదులు..

బావలు, మరదులు..

నమిత మాట్లాడుతూ.. జయలలిత తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని, పరిపాలన బాగుండటంతో తాను అన్నాడీఏంకేలో చేరుతున్నానని చెప్పారు. పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. గత లోకసభ ఎన్నికల్లో బిజెపిలో చేరేందుకు నమిత ఉత్సాహం చూపించారు. అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మిన్నకుండిపోయారు. నమిత అభిమానులను మచ్చన్స్ (బావలు లేదా మరుదులు)గా పిలుస్తుంటారు. తెలుగహు, తమిళ చలనచిత్రాల్లో నటించిన నమితకు మంచి గుర్తింపు ఉంది.

గుజరాత్ లో పుట్టినా

గుజరాత్ లో పుట్టినా

తమిళులు తనకు గుర్తింపునిచ్చారని అన్నారు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. తనది గుజరాత్‌ రాష్ట్రమే అయినా సరికొత్త జన్మనిచ్చింది తమిళనాడు అయినందున తన జీవితాన్ని రాష్ట్రానికి అంకితం చేస్తానని ఆమె చెప్పారు.

మీడియాకు ఎలా షాక్ ఇచ్చానో

మీడియాకు ఎలా షాక్ ఇచ్చానో

పలు రాజకీయ పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే ఎవరు పిలిచారన్నది ఇప్పుడు చెప్పనని ఆమె అన్నారు. ఇప్పుడు స్లిమ్‌గా తయారై మీ అందరికీ (మీడియా) ఎలా షాకిచ్చానో, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ షాకివ్వబోతున్నానని చెప్పారు.

ఆత్మవిశ్వాసమే..

ఆత్మవిశ్వాసమే..

బరువు తగ్గడం అసాధ్యమని ఎంత మంది చెప్పినా దాన్ని ఎలా సుసాధ్యం చేశానో, అలాగే రాజకీయాల్లోనూ అనుకున్నది సాధించి తీరుతానని ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. నమిత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు.

లావు ఎక్కటమే..

లావు ఎక్కటమే..

జెమిని సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత అప్పట్లో తన అందం, నాజూకు తనంలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైన తర్వాత నమిత భారీగా లావెక్కింది. ఎంతగా అంటే ఇక ఆమె సినిమాకు పనికి రాదని దర్శకులు, నిర్మాతలు భయపడేంత. అయితే అఫ్ కోర్స్ ఆ లావు గా ఉండటం కూడా కొంతమందికి నచ్చిందనుకోండి.

అఘోరా లుక్ తో

అఘోరా లుక్ తో

బరువు తగ్గడంతో అవకాశాలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో 'పొట్టు' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇదో హారర్ ఫిల్మ్. ఇందులో ఇందులో నమిత అఘోరాలను తలపించే షాకింగ్ లుక్ తో కనిపించబోతోంది. ఈ చిత్రానికి వడిఉదయన్ దర్శకత్వం వహిస్తున్నారు.

పదిలంగా ఉండిపోతా

పదిలంగా ఉండిపోతా

తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇస్టమని, అందుకే గుజరాత్ వదిలి ఇక్కడే సెటిలయ్యాను, ఇదే నా పుట్టినిల్లు అంటోంది. గుజరాత్ లో జరిగే పండుగల గురించి మరిచిపోయాను. తమిళంలో అన్ని పండుగల గురించి నాకు తెలుసు. పొంగల్ అంటే ఎంతో ఇష్టం. తమిళ జనాలు తనను ఎంతో ఆదరించారని, తాను ఇతర భాషా చిత్రాల్లో నటించినా... తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను అంటూ చెప్పుకొచ్చింది.

డైట్ మెయింటైన్ చేయలేకపోయా

డైట్ మెయింటైన్ చేయలేకపోయా

ఈ మధ్య అవకాశాలు లేక డైట్ మెయింటేన్ చేయక పోవడంతో బరువు పెరిగాను. ప్రస్తుతం బరువు తగ్గేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. 94 కిలోల నుండి 76కు తగ్గాను. ఇపుడు అవకాశాలు మళ్లీ వస్తున్నాయి. మళయాలంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించాను అని తెలిపింది.

నాకు అదేమి తెలియదు

నాకు అదేమి తెలియదు

తాను నిర్మాతగా మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనకు నటించడం తప్ప సినిమా నిర్మించడం తెలియదని నమిత చెప్పింది. మంచి కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అలరిస్తాను ఆమె చెప్పుకొచ్చారు.

డబ్బులు ఎగ్గొట్టాడు

డబ్బులు ఎగ్గొట్టాడు

నన్ను ఓ ఈవెంట్ మేనేజర్ ఆ మధ్యన మోసం చేశాడు.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇస్తానని ఒప్పుకున్న సొమ్మును ఇవ్వకుండా ముఖం చాటేశాడు. సూరత్‌లో జరిగిన ఓ వేడుకలో ప్రత్యేకంగా నర్తించి అక్కడి ఆహుతుల్ని అలరించాను. కానీ డబ్బులు ఎగ్గొట్టాడు.

అందుకే లావైంది

అందుకే లావైంది

'జెమిని' సినిమాలో ఎంతో ముద్దుగా కనిపించిన నమిత......ఆ మధ్యన మాటల్లో చెప్పలేనంద బొద్దుగా తయారైంది. నమిత ఇలా తయారు కావడానికి కారణం....స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి వ్యసనాలే కారణమనే వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో వినిపించాయి. అమ్మడు భారీగా లావెక్కడంతో సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. కనీసం ఐటం సాంగు అవకాశాలు నమితకు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడటం లేదు ఇపుడు. దీంతో సన్నబడాలని నిర్ణయించుకున్న నమిత కేరళలోని ఆయుర్వేదం ట్రీట్‌మెంట్‌ చేసుకుని తగ్గి కనిపించి షాక్ ఇచ్చింది.

English summary
Actress Namitha wants parents to talk to their children about sexual abuse. The actress spoke at the audio launch of Saaya, and revealed that she found the recent incidents of child sexual abuse ‘scary’. She added that it was up to the parents to make sure their children are adequately equipped to confront such a situation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu