»   »  మెస్మరైజ్: విలేజ్ అమ్మాయిగా ...నయనతారలుక్ (ఫొటో)

మెస్మరైజ్: విలేజ్ అమ్మాయిగా ...నయనతారలుక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నయనతార ఫ్యాన్స్ పండుగ చేసుకునే లుక్ రిలీజైంది. విలేజ్ అమ్మాయిగా నయనతార కనిపించి అందరినీ అలరించింది. 'ఈ' చిత్రం తర్వాత జీవా, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'తిరునాల్‌'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. కుంభకోణం, సమీప ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొరటుస్వభావమున్న గ్రామీణ యువకుడిగా ఇందులో నటిస్తున్నారు జీవా. లంగా, ఓణీతో గ్రామీణ అమ్మాయి పాత్ర పోషిస్తోంది నయనతార. తాజాగా విడుదలైన జీవా, నయనతార ఫొటోను చూసి చూడముచ్చట జంట అంటూ కితాబిస్తోంది కోలీవుడ్‌.

హాస్యం, యాక్షన్‌ కలగలిసిన ఈ సినిమా కోసం కుంభకోణంలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెట్‌లో వెయ్యి మందికిపైగా జూనియర్‌ ఆర్టిస్టులతో కలిసిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. కోదండపాణి ఫిలిమ్స్‌ బ్యానరుపై సెంథిల్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా గురించి దర్శకుడు బీఎస్‌ రామనాథ్‌ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత జీవా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. గ్రామీణ యువకుడిగా ఆయన నటనకు ప్రేక్షకులు, అభిమానులు తప్పకుండా బ్రహ్మరథం పడతారు. ఇక నయనతార జోడీ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. శ్రీ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫి మహేష్‌ ముత్తుస్వామి, ఎడిటింగ్‌ వీటీ విజయన్‌, ఆర్ట్‌ శను. స్టంట్‌ సూపర్‌ సుబ్బరాయన్‌.

Nayantara Mesmerises As Village Girl

ఈ రోజు నయనతారది మరొకటి

అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఆరి, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'మాయా'. దీని చిత్రీకరణ పనులు ముగిసిన నేపథ్యంలో తుది విడత పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఇటీవల విడుదల నేపథ్యంలో ఇది ప్రేక్షకుల్లో పలు అంచనాలకు తెర లేపింది.

చిత్రం ట్రయలర్‌ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో గురువారం ట్రయలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'మాయా' చిత్రానికి రాన్‌ యోహాన్‌ సంగీతం సమకూర్చగా ఫొటోగ్రఫీ సత్యన్‌ సూర్యన్‌.రోబో శంకర్‌, లక్ష్మీ ప్రియ, అంజద్‌ఖాన్‌ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

నయనతార మరికొన్ని చిత్రాల్లో నటిస్తుండగా వాటిలో 'నానుం రౌడిదాన్‌' చిత్రీకరణ పనులు ముగిశాయి. ప్రస్తుతం ఆమె కార్తిక్‌ జంటగా 'కాష్మోరా' చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Yesterday some pictures from Nayantara upcoming movie “Tirunaal” have come out. In this flick, Nayantara is paired opposite Tamil hero Jiiva and she looks completely like a village girl.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu