For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార ఇలా ఇరుక్కుపోయిందేంటి, గొడవ గట్టిగానే ఉంది

  By Srikanya
  |

  చెన్నై: నయనతార మళ్లీ వివాదంలో ఇరుక్కుంది. ఈ సారి ఓ లిప్ లాక్ గురించి , చెన్నై పరిశ్రమ మొత్తం ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ అన్నాక లిప్ లాక్ లు కామన్ కదా అంటారా..అదే ఏ హీరోతోనే లిప్ లాక్ అయితే ఎవరూ పట్టించుకోకపోదురు. కానీ ఈ సారి నయనతార లిప్ లాక్ ఇచ్చింది. ఓ చిన్నపిల్లోడు కు.

  ఇంతకీ ఏ సినిమాలోది ఈ సీన్ అంటారా..రీసెంట్ గా నయనతార, జీవా కాంబినేషన్ లో తెరకెక్కి,రిలీజ్ అయిన తిరునాల్ చిత్రంలోది. వాస్తవానికి ఈ సీన్ వల్గర్ గా లేకపోయినా, ఇలాంటి సీన్స్ వల్ల తప్పుడు సంకేతాలు చిన్న పిల్లల్లోకి పంపుతున్నారని, ఇది చైల్డ్ రైట్స్ కు విరుద్దం అంటున్నారు.

  అయితే సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో టీమ్ ఈ కాంట్రవర్శీ తమ సినిమా పబ్లిసిటీ కు పనికొచ్చే అవకాసం ఉందన్నట్లుగా సైలెంట్ గా చూస్తున్నారు. కానీ దర్శకుడు చీప్ టేస్ట్ కు ఇది నిదర్శనం అని, నయనతార అయినా ఇలాంటి సీన్ చేయనని అడ్డు చెప్పవచ్చు కదా, అలాంటిది చేయని నయనతార కూడా ఇందులో తప్పు ఉందని అంటున్నారు.

  స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

  సీన్ తీసేయమని

  సీన్ తీసేయమని

  వివాదం రేపుతున్న ఆ లిప్ లాక్ సీన్ తీసేయమని, ధియేటర్స్ వద్ద నిరసన ప్రకటిస్తున్నారు. అయితే టీమ్ ఇంకా స్పందించలేదు

  సీన్ కంటెంట్

  సీన్ కంటెంట్

  సీన్ విషయానికి వస్తే..ఇందులో కొంతమంది స్కూల్ పిల్లలను గ్రీట్ చేసి, వాళ్లను తన బుగ్గమీద ముద్దు పెట్టమని అడుగుతుంది. అందులో ఓ నాటీ కుర్రాడు ఆమె బుగ్గ మీద కాకుండా పెదాలపై లిప్ లాక్ కిస్ ఇస్తాడు

  షాక్

  షాక్

  ఆ పిల్లాడు అలా లిప్ లాక్ కిస్ ఇవ్వగానే నయనతార షాక్ అవుతుంది. అలాంటిది తను ఎక్సపెక్ట్ చేయలేదని అంటుంది.

  ఇలాంటి ధోరణే

  ఇలాంటి ధోరణే

  లిప్ లాక్ లు వంటి విషయాలు పిల్లల మనస్సుల్లోకి కూడా చొరబడ్డాయని చెప్పటమే తమ ఆలోచన అంటున్నారు టీమ్ కు చెందిన వారు

  చెడు ఆలోచన లేదు

  చెడు ఆలోచన లేదు

  తమకు పిల్లల మనస్సులు చెడకొట్టాలనే మరొకటి అనేదో లేదని బయిట పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయం చెప్పామని నిర్మాతలు సమర్దించుకోచూస్తున్నారు.

  వరస హిట్స్ తో ఉన్న..

  వరస హిట్స్ తో ఉన్న..

  రాజారాణి, ఆరంభం, ఇదు కుథిర్వేల‌న్ కాద‌ల్, నాన్ బెండా, భాస్క‌ర్ ది రాస్కెల్, తని ఒరువ‌న్, మాయ‌, నానుం రౌడీధాన్, పుతీయ నియ‌మం, ఇదు న‌మ్మ ఆలు సినిమాల‌తో ఫామ్ లో ఉన్న న‌య‌న‌తార‌కు తిరునాల్ సినిమాతో ఫ్లాపిచ్చేసాడు జీవా.

  ఆశలన్నీ

  ఆశలన్నీ

  ఇక రేపు విడుదల అవుతున్న బాబు బంగారం పైనే నయనతార ఆశలు అన్ని ఉన్నాయి

  బెస్ట్ అంటోంది

  బెస్ట్ అంటోంది

  మాయ‌, త‌ని ఒరువ‌న్, నానుం రౌడీథాన్ లాంటి సినిమాల్లో న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో మెప్పించింది న‌య‌న‌. అవే బెస్ట్ అని భావిస్తోంది ఆమె.

  అదో వివాదం..

  అదో వివాదం..

  ‘తిరునాళ్' అనే తమిళ చిత్రానికి సంబంధించిన ఫోటోల్లో ఆమె బీర్ బాటిల్ పట్టుకుని ఉండటం వివాదాస్పదం అయింది. అయితే ఈ వివాదం సినిమాకు పబ్లిసిటీ పరంగా కలిసొచ్చింది.

  గతంలో కూడా...

  గతంలో కూడా...

  నయనతార రోడ్డుపై ఉన్న షాపులో బీరు కొనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. నయనతార అలా రోడ్డుపై బీర్ కొనే సీన్ చూసి చాలా మంది షాకయ్యారు. అయితే అది ఆమె నటించిన ‘నానుమ్ రౌడీ ధాన్' సినిమాలోని సీన్ అని తెలియడంతో ఆశ్చర్యపోయారు.

  English summary
  Nayantara has landed in the soup over a lip-lock and has got the whole town talking about it. Only this time, the lip-lock involves a young boy!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X