Don't Miss!
- Sports
ఆ విషయంలో వృద్ధిమాన్ సాహాకు లైన్ క్లియర్.. ఇక రంజీట్రోఫీలో ఆ జట్టు తరఫున బరిలోకి..
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- News
ఒక్కరు చెప్పేది 135 కోట్ల మంది వినాలా-హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా కీలక కామెంట్స్..
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Automobiles
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Nayanatara పెళ్లి డేట్ ఫిక్స్.. మ్యారేజ్‌కు ముందు సీక్రెట్‌గా విహారయాత్ర.. ఎక్కడకు వెళ్లారంటే!
దక్షిణాది సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ సుదీర్ఘ ప్రేమకథకు ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వారి డేటింగ్ వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నది. అయితే ఇటీవల ఈ ఇద్దరి సెలబ్రిటీల పెళ్లి వార్త మీడియాలో ప్రధానంగా చర్చకు దారి తీసింది. అయితే పెళ్లి విషయం పక్కన పెడితే వీరిద్దరూ కలిసి ఇటీవల పురాతన ప్రదేశాలను, పుణ్య క్షేత్రాలను తిరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లికి ముందు వారిద్దరి చేసిన పర్యటన గురించిన వివరాల్లోకి వెళితే..

జూన్ 9వ తేదీన వివాహం
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి వార్త మరింత జోరందుకున్నది. జూన్ 9వ తేదీన నయనతార వివాహం జరుగుతుందనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో వీరిద్దరి వివాహం జరుగుతుందనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే ఈ వార్తపై వారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనేక సందేహాలకు దారి తీసింది.

నయనతార పెళ్లికి జోరుగా ఏర్పాట్లు
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని, జూన్ 9వ తేదీన తిరుపతిలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తర్వాత చెన్నైలో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లలో స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మహబలిపురం పర్యటనకు వెళ్లిన లవ్‌బర్ట్స్
నయనతార, విఘ్నేష్ శివన్ సంయుక్తంగా నిర్మించిన కథు వాకులా రెండు కాదల్ చిత్రం రిలీజై తమిళంలో మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. సినిమా అందించిన విజయం నేపథ్యంలో వారు తమిళనాడులోని మహబలిపురంకు వెళ్లారు. అక్కడి పురాతన కట్టడాలను సందర్శించారు. వారిద్దరి పర్యటనకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి.

బిర్యాని తిని.. ఎంజాయ్ చేసిన నయనతార
నయనతార, విఘ్నేష్ ఇటీవల మహబలిపురంలో పర్యటించారు. చిన్న ట్రిప్పును వారు బాగా ఎంజాయ్ చేశారు. మహబలిపురంలోని ప్రముఖ రెస్టారెంట్‌లో బిర్యానిని తిన్నారు. అలాగే తనకు ఇష్టమైన చేప వంటకాలను ఆస్వాదించారు. అనంతరం తమ అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు అని మీడియా వెల్లడించింది.

నయనతార, విఘ్నేష్ శివన్ కెరీర్ ఇలా
నయనతార, విఘ్నేష్ శివన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. అజిత్‌తో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నది. అలాగే నయనతార పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. O2, గోల్డ్, గాడ్‌ఫాదర్, కనెక్ట్ సినిమాల్లో నటిస్తున్నారు.